క్రికెట్ ఆట మొద‌లెట్టారు

Last Updated on by

క్రికెట్ నేప‌థ్య ంలో టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఆ మాట‌కొస్తే దేశంలో క్రికెట్ నేప‌థ్య ంలో పెద్దంత‌గా ప్ర‌యోగాలేవీ చేయ‌లేదు. ల‌గాన్‌, ఎం.ఎస్‌.ధోనీ, స‌చిన్, అజార్ (అజ‌హ‌రుద్దీన్) సినిమాలు లేక‌పోతే అస‌లు క్రికెట్ పై సినిమాలు లేన‌ట్టే. అందుకే ఇప్పుడు నాని ట్రై చేస్తున్నాడు. కొత్త‌గా స‌రికొత్త‌గా క్రికెట్ ఆట‌గాడిగా క‌నిపించ‌నున్నాడు.

నాచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ జంట‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం జెర్సీ. గౌతమ్‌ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. క్రికెట్ నేప‌థ్య ంలోని ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది. ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మాట‌ల మాయావి త్రివిక్ర‌మ్, రాధాకృష్ణ‌, నాగ వంశీ, ప్ర‌సాద్‌, నాని, గౌత‌మ్‌, శ్ర‌ద్ధా త‌దిత‌రులు పాల్గొన్నారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని నిర్మాతలు తెలిపారు. సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మ్యూజిక్:అనిరుద్, కెమెరా: సాను వర్గీస్, క‌ళ‌: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: నవీన్ నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత‌: సూర్య దేవర నాగ వంశి, కధ, క‌థ‌నం, దర్శ‌కత్వ ం: గౌతం తిన్ననూరి.

User Comments