ప్రేమ‌లో లేటు వ‌య‌సు క్రికెట‌ర్!!

Last Updated on by

వైవిధ్య‌మైన క‌థ‌ల్ని ఎంచుకుని.. పాత్ర‌ల్లో కొత్త‌ద‌నం చూపిస్తూ హిట్లు కొట్ట‌డం నాని స్టైల్. ప‌క్కింటి అబ్ంబాయిలా క‌నిపిస్తూనే బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టే ద‌మ్ము త‌న‌కు ఉంది. నేచురల్ స్టార్ నాని మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. నాని-  శ్రద్ధ శ్రీనాథ్ నాయ‌కానాయికలుగా మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో    సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై   సూర్యదేవర నాగ వంశి   నిర్మిస్తున్న జెర్సీ అత‌డి కెరీర్ లో ఓ వైవిధ్య‌మైన క‌మ‌ర్షియ‌ల్‌ చిత్రంగా నిల‌వ‌నుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవ‌లే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి స్పందన బావుంది.
దర్శకుడు మాట్లాడుతూ-  జెర్సీ చిత్రం నాకు సినిమాగానే  కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో చోటు సంపాదించుకుంటుం. ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ పాత్ర‌లో ఒదిగిపోయి సినిమా బాగా రావడానికి నాని చేసిన సాయం గొప్ప‌ది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ప్రస్తుతం నిర్మాణానంతర   ప‌నులు సాగుతున్నాయి. మా సంస్థ‌లో చాలా ప్రత్యేకంగా  నిలిచిపోతుంది. ఏప్రిల్ 19 న విడుదల చేస్తున్నాం.. అన్నారు. సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం. సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్.

User Comments