ట్రైల‌ర్ రాకుండానే అమెరికా జంప్‌!

నేచురల్‌ స్టార్‌ నాని- విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలీఎంటర్‌టైనర్ `నాని`స్‌ గ్యాంగ్‌ లీడర్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆగష్టు 28 న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా..

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ – “గ్యాంగ్‌లీడర్‌ అనేది తొలి నుంచి మాకు చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌. టీమ్‌ అందరం ఎంతో ఇష్టపడి ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాం. నా అన్ని సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్‌ ఎనర్జీతో సినిమా స్టార్ట్‌ చేశారు. అందుకు తగ్గట్లే మంచి అవుట్‌ ఫుట్‌ వచ్చింది. ఆగష్టు 28న `గ్యాంగ్‌ లీడర్‌` థియేట్రికల్‌ ట్రైలర్‌ను అన్ని థియేటర్స్‌లో ప్లే చేయబోతున్నాం..అలాగే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం. సినిమా విడుదలకోసం చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. కార్తికేయ నెగటివ్‌రోల్‌లో అదరగొట్టాడు. నిజంగా తను మంచి పెర్ఫార్మర్‌. అలాగే మొదటి సినిమా అయినా ప్రియాంక బాగా చేసింది. తను పీసి గారి ఛాయిస్‌. అలాగే సీనియర్‌ నటి లక్ష్మీ గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ. ఆమెతో వర్క్‌ చేయడం ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆవిడ అన్ని భాషలు మాట్లాడతారు. అలాగే శరణ్య గారు నాయకుడు సినిమా నుండి ఆవిడ టైమింగ్‌ కానీ పెర్ఫామెన్స్‌ కానీ నాకు చాలా ఇష్టం. మైత్రి మూవీస్‌ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు వారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఇప్పటికే టీజర్‌లో మీరు చూశారు.. రేపు ట్రైలర్‌ రిలీజయ్యాక మీకే తెలుస్తుంది. ట్రైలర్‌కి కూడా అంత కన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ‘జెర్సీ’ సినిమా చేస్తున్నప్పుడే మ్యూజిక్‌ నచ్చి అనిరుద్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందించారు. మిరోస్లా కుబా బ్రోజెక్‌ పోలెండ్‌లో చాలా ఫేమస్‌ సినిమాటోగ్రాఫర్‌. విక్రమ్‌ తన ఫ్రెండ్‌ ద్వారా అతన్ని కాంటాక్ట్‌ అయ్యి ఈ ప్రాజెక్టుకి ఓకే చేశారు. మంచి విజువల్స్‌ ఇచ్చారు. ఆగష్టు 28న విడుదలయ్యే థియేట్రికల్‌ ట్రైలర్‌ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను“ అన్నారు. అయితే గ్యాంగ్ లీడ‌ర్ స‌డెన్ ప్రెస్ మీట్ అంటూ నాని ఇలా హ‌డావుడిగా మీడియాని క‌లుసుకోవ‌డానికి కార‌ణం అత‌డు అమెరికా వెళుతున్నార‌ని తెలుస్తోంది.

“భయపెట్టే పాత్ర‌లో న‌టించాను. నేను సినిమాలోకి రావడానికి స్ఫూర్తి అయిన నాని తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ“ అని కార్తికేయ‌ అన్నారు. లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌.