బాబోయ్.. నాని ఇంత మాస్ ఏంటి..?

Last Updated on by

నాని మాస్ హీరో అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్టం.. ఆయ‌న ఏ ఒక్క జోన‌ర్ హీరోనో కాదు.. అన్ని జోన‌ర్లు ఆయ‌నవే అంటాడు. క‌థ‌లకు త‌గ్గ‌ట్లుగా మారిపోతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఈయ‌న కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధంలోని తొలి పాట విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత నానిని మాస్ హీరో కాద‌ని ఎవ‌రైనా అంటే అస్స‌లు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ పాట సాగిన తీరు అలా ఉంది మ‌రి. హిప్ హాప్ త‌మిళ‌న్ సంగీతం అందించిన ఈ పాట క‌చ్చితంగా చార్ట్ బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

అంతా త‌మిళ్ యాసలో సాగిపోయే ఈ పాట‌లో నాని కూడా సూప‌ర్ మాస్ గా క‌నిపించాడు. లుంగీలో డాన్సులు చేసాడు. గ‌ర‌గాట‌కార‌న్ అనే డాన్స్ మూవ్స్ తో ఈ పాట సాగుతుంది. త‌మిళ‌నాట ఫేమ‌స్ డాన్స్ ఇది. దాన్ని ఈ సినిమా కోసం వాడుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. చిత్తూరు జిల్లా కావ‌డం.. అక్క‌డికి త‌మిళ‌నాడు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో అక్క‌డి నృత్యాన్ని కూడా త‌న సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు. దానికి నాని కూడా పూర్తి స‌హ‌కారం అందించాడు. ఈ పాట చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మరింత‌గా పెరిగిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుద‌ల కానుంది. ఈ సినిమాతో నాని ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో..?

User Comments