శ్రీ‌రెడ్డికి నాని లీగ‌ల్ నోటీస్‌

Last Updated on by

నేను నా గురించి బాధ‌ప‌డ‌లేదు.. నేను ఎలాంటి స‌మాజంలో బ‌తుకుతున్నానో అని బాధ‌ప‌డ్డాను.. అని క‌ల‌త చెందారు నేచుర‌ల్ స్టార్ నాని. న‌టి శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల నానీ వ్య‌క్తిత్వాన్ని త‌ప్పు ప‌డుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కామెంట్స్ తెలుగు ప్ర‌జ‌ల్లో, అభిమానుల్లో పెనుదుమార‌మే రేపాయి. నాని లాంటి సాఫ్ట్ ప‌ర్స‌నాలిటీ ఇలా చేసి ఉంటారా? అంటూ అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. నాని న‌టీమ‌ణుల జీవితాల‌తో ఆడుకున్నావ్‌! అంటూ శ్రీ‌రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

అయితే అప్ప‌టికి నాని స్పందించ‌లేదు. కాస్త ఆల‌స్యంగా అయినా అత‌డు రియాక్ట‌వుతున్న తీరు కాస్తంత ఘాటుగానే ఉంద‌ని చెప్పాలి. తాజాగా శ్రీ‌రెడ్డికి నాని లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఆ సంగ‌తిని ట్విట్ట‌ర్ మాధ్య‌మం ద్వారా అభిమానుల‌కు నేరుగా షేర్ చేశారు. “క్ష‌ణికావేశానికి లోను కాను. అవ‌త‌లివాళ్ల‌కు ఏం కావాలో అది ఇవ్వ‌ను. ప‌రువు న‌ష్టం దావా వేశానంతే. అంద‌రి పేర్ల‌తో పాటు నా పేరు కూడా క‌లుపుకుని ర్యాండ‌మ్‌గా ప్ర‌చారం చేసుకుంటే వ‌దిలేస్తానా? అస్స‌లు వ‌దిలిపెట్ట‌ను. ఆధారం లేని .. బుర్ర‌లేని ఆరోప‌ణ‌లు న‌న్ను బాధించాయి. అందుకే చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నా“ అని నాని ట్వీట్ చేశారు. మొత్తానికి శ్రీ‌రెడ్డికి ఒక్కో ఉచ్చు మెడ‌కు బిగుస్తున్నాయ‌నే భావించాలి. అలానే ప్ర‌తిష్ఠాత్మ‌క బిగ్‌బాస్ షోలో శ్రీ‌రెడ్డి న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ నిన్న ప్ర‌క‌టించిన పేర్ల‌లో శ్రీ‌రెడ్డి పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌న‌కు తానుగా పెట్టుకున్న కొరివికి శ్రీ‌రెడ్డి బ‌లైంద‌ని, బిగ్‌బాస్ అవ‌కాశం కోల్పోవ‌డం అందులో భాగ‌మేన‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయ్‌.

User Comments