Nani's MCA Movie Pre Release Business Star Heroes Shocked

ఎంసిఏ బిజినెస్.. స్టార్స్ కు షాక్..

Nani MCA Movie Pre Release Business Shocked

నాని అంటే ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్. హిట్ సినిమాలు స‌ప్లై చేసే మిష‌న్. ఈయ‌న ఓ క‌థ ఓకే చేస్తే ఇప్పుడు హిట్ అనే అంచ‌నాకు వ‌చ్చారు ప్రేక్ష‌కులు. నిర్మాత‌లు కూడా అంతే. అలాంటి నానిని ఇప్పుడు చిన్న హీరో అంటే ఒప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంసిఏ బిజినెస్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తున్నాయి. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే 60 ల‌క్ష‌లు దాటి 75 ల‌క్ష‌ల వ్యూస్ వైపు అడుగేస్తుంది. నాని సినిమాల్లోఇది రికార్డ్. నాని ఏదో హిట్ల‌లో ఉన్నాడ‌ని ఎంసిఏ పై అంచ‌నాలు పెర‌గ‌డం కాదు కానీ ఈ చిత్రానికి మ‌రో స్పెషాలిటీ కూడా ఉంది. సాయిప‌ల్ల‌వి అనే బ్రాండ్. అవును.. నాని న్యాచుర‌ల్ స్టార్.. సాయిప‌ల్ల‌వి న్యాచుర‌ల్ యాక్ట‌ర్.. ఈ ఇద్ద‌రూ కలిస్తే ఇక స్క్రీన్ షేక్ అయిపోదా..? ఇప్పుడు ఓ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఇలాగే వేచి చూస్తున్నారు. అదే ఎంసిఏ. నాని హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత‌. టీజ‌ర్ లో కూడా ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ 15న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. నానితో ఈమె జోడీ క‌ట్ట‌డం తొలిసారి. ఇప్ప‌టికే ఫిదాతో సాయిప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీని ఫిదా చేసింది. ఇప్పుడు ఈమె సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో కూడా ఆస‌క్తి బాగా పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే.. ఇంకా చెప్పాలంటే తొలి సినిమాతోనే సాయిప‌ల్ల‌వికి అభిమానులు కూడా వ‌చ్చేసారు. ఇలాంటి టైమ్ లో త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్ తో ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి.. న్యాచుర‌ల్ స్టార్ తో ఎలా రెచ్చిపోయిందో అని ఆస‌క్తిగా చూస్తున్నారు. ఒకే తెర‌పై ఇటు నాని.. అటు సాయిప‌ల్ల‌విని చూస్తుంటే అబ్బో చూసేవాళ్ల‌కు పండ‌గే పండ‌గ‌.

పైగా ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. అస‌లు ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ర‌వితేజ సినిమాల‌కు కూడా ఈ రేంజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం లేదిప్పుడు. కానీ నానికి జ‌రిగిపోతుంది. థియెట్రిక‌ల్ బిజినెస్ రూపంలోనే దిల్ రాజుకు 25 కోట్లు వ‌చ్చేస్తున్నాయి. ఇక డిజిటల్ రైట్స్ ను అమేజాన్ 5.50 కోట్ల‌కు ఎగ‌రేసుకుపోయింది. శాటిలైట్ ఎంత లేద‌న్నా 6 కోట్ల‌కు పైగానే రానుంది. మిగిలిన రైట్స్ అన్నీ క‌లిపితే మ‌రో 10 కోట్ల వ‌ర‌కు రానున్నాయి. అంతా కొడితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించింది 20 కోట్ల‌లోపే. అంటే విడుద‌ల‌కు ముందే నిర్మాత‌కు 20 కోట్ల లాభం అన్న‌మాట‌. ఇప్పుడు చెప్పండి.. నాని సినిమా అంటే స్టార్స్ కు షాకా కాదా..?

ఎంసిఏ బిజినెస్.. స్టార్స్ కు షాక్..
0 votes, 0.00 avg. rating (0% score)