నాని చిత్రం… `శ్యామ్ సింగ రాయ్‌`

నాని క‌థానాయ‌కుడిగా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌బోతోంది. `టాక్సీవాలా`తో విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు రాహుల్‌. చాలా రోజుల కింద‌టే నానికి ఈ క‌థ చెప్పి ఒప్పించారు. ప‌క్కాగా స్క్రిప్టుని సిద్ధం చేశారు. ట‌క్ జ‌గ‌దీష్ త‌ర్వాత ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రానికి `శ్యామ్ సింగ రాయ్‌` అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు సమాచారం. ఈ పేరే చిత్రంగా ఉందంటే, ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇదొక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మ‌ని, నాని స్టైల్ ఫ‌న్‌తో పాటు… మాస్ అంశాలు కూడా ఉంటాయ‌ని స‌మాచారం.