కృష్ణార్జున యుద్ధం నానికి న‌చ్చ‌లేదా..?

Last Updated on by

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌లివే. నాని సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉన్నారు ప్రేక్ష‌కులు. అందుకే త‌న సినిమాల ఔట్ పుట్ విష‌యంలోనూ నాని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఏ చిన్న తేడా జ‌రిగినా అస్స‌లు ఊరుకోవ‌డం కూడా లేదు. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమాతో వ‌స్తున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెజ్ రాజా లాంటి హిట్స్ త‌ర్వాత గాంధీ తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఒక‌టి తిరుప‌తిలో ఉండే మాస్ పాత్ర అయితే.. మ‌రోటి ఇట‌లీలో ఉండే రాక్ స్టార్ పాత్ర‌. ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కామెడీని హ్యాండిల్ చేయ‌డంలో మేర్ల‌పాక గాంధీ ఆరితేరిపోయాడు. ఇక నాని కూడా కామెడీలో కింగ్. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే వ‌చ్చే సినిమా కూడా న‌వ్వుల ప్ర‌యాణంలా ఉంటుంద‌ని అనుకుంటున్నారంతా. ఈ సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో దిల్ రాజు 23 కోట్ల‌కు డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ కూడా ద‌క్కించుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ.. ఈ మ‌ధ్యే సినిమా ఔట్ పుట్ చూసిన నాని.. అసంతృప్తిగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. కొన్ని సీన్లు ఈయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. వాటిని రీ షూట్ చేయాల్సిందే అని ద‌ర్శ‌కున్ని కోరాడ‌ని తెలుస్తుంది. వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాల‌తో దూకుడు మీదున్న నాని.. ఇప్పుడు కానీ ఒక్క ఫ్లాప్ ఇస్తే అస‌లుకే మోసం వ‌స్తుంది. పైగా మొన్న విడుద‌లైన ఎంసిఏకి తొలిరోజు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది.. కానీ పోటీ లేక సినిమా సూప‌ర్ హిట్టైంది. ఆ సినిమా విష‌యంలో జ‌రిగిన త‌ప్పు ఇంకోసారి జ‌ర‌క్కూడ‌ద‌ని ఫిక్స్ అయిపోయాడు నాని. పైగా ఎంసిఏ 40 కోట్ల మార్క్ అందుకుంది.. ఇప్పుడు కానీ కృష్ణార్జున యుద్ధం హిట్టైతే ఈజీగా 50 కోట్ల మార్క్ అందుకునే అవ‌కాశం ఉంది. దాంతో రిస్క్ తీసుకోడానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు నాని. అందుకే ఈ సినిమాను అవ‌స‌ర‌మైతే రీ షూట్ చేయాల్సిందే అని ప‌ట్టు ప‌డుతున్నాడు. చూడాలిక చివ‌రికి ఏం జ‌రుగుతుందో..? ఈ చిత్రం ఎప్రిల్ 12న విడుద‌ల కానుంది.

User Comments