దిల్ రాజు సపోర్ట్ తో నాని రాజకీయాలు

Last Updated on by

ఇప్ప‌ట్నుంచీ మ‌రో ఏడాది పాటు రాజ‌కీయాలు బాగా వేడెక్కనున్నాయి. దానికి కార‌ణం మ‌రో ఏడాదిలో ఎల‌క్ష‌న్స్ వ‌స్తుండ‌టమే. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ రాజ‌కీయ వేడిని వాడుకోవాల‌ని చూస్తుంటారు. అలాంటి సినిమాలే చేస్తుంటారు. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేనుతో మ‌హేష్ కూడా ర‌చ్చ చేసాడు. ఇక ఇప్పుడు నాని కూడా పొలిటిక‌ల్ వైపు అడుగేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈయ‌న ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం.. కుర్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో జెర్సీ సినిమా ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత దిల్ రాజుతో మ‌రోసారి నాని జోడీ క‌ట్ట‌బోతున్నాడు.

ఈ కాంబినేష‌న్ లో ఈ సారి ఏకంగా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా రాబోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ కూడా ప్ర‌చారంలో ఉంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇదే ఏడాది చివ‌ర్లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కించి.. వ‌చ్చే ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేయాల‌నికి దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే దీనికి ద‌ర్శ‌కుడు ఎవ‌రనేది మాత్రం ఇంకా తేల‌లేదు. కానీ నాని మాత్రం రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయం అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి నాగ్ తో మ‌ల్టీస్టారర్.. ఆ త‌ర్వాత క్రికెట్ నేప‌థ్యం ఉన్న సినిమా.. మ‌రోవైపు రాజ‌కీయం.. ఇలా దేనికి అదే డిఫెరెంట్ జోన‌ర్స్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు న్యాచుర‌ల్ స్టార్.

User Comments