మ‌రీ ఇంత `వి`ల‌నిజ‌మా నానీ?

హీరో కాస్త విల‌న్‌గా మారిపోయి న‌టించాడంటే దానికో లెక్క ఉంటుంది. సినిమాలో ఎక్క‌డో ఒక చోట ఆ పాత్రపై సింప‌తీ క‌లిగేలా చేస్తుంటారు ద‌ర్శ‌కులు. అత‌ని విల‌నిజానికి ఓ బ‌ల‌మైన కార‌ణాన్ని చూపిస్తుంటారు. కొన్నిసార్లు విల‌నే గెల‌వాల‌నిపించేలా క‌థ‌, పాత్ర‌ల్ని తీర్చిదిద్దుతుంటారు. అలాంటి పాత్రలు రాస్తున్నందుకే హీరోలు ధైర్యంగా విల‌న్లుగా న‌టించేందుకు ముందుకొస్తుంటారు. ఈమ‌ధ్య యువ క‌థానాయ‌కులు ఆ పాత్ర‌ల‌పై మ‌రింత మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నట‌న ప‌రంగా మ‌రింత పేరొస్తుంద‌నే ఆ ప్ర‌య‌త్నం. తాజాగా నాని `వి` సినిమాతో విల‌న్‌గా మారాడు.

Natural Star Nani,ndraganti Mohan Krishna,Sudheer Babu,Aditi Rao Hydari,

నానిలాంటి క‌థానాయ‌కుడు విల‌న్ అంటే `పిల్ల జమిందార్‌` త‌ర‌హా పొగ‌రుబోతు పాత్రో, మ‌రొక‌టో అనుకుంటారు. కానీ ఏకంగా ఆయ‌న‌తో క‌త్తెర ప‌ట్టించేశాడు ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఈరోజే విడుద‌లైన ఆ పోస్ట‌ర్ చూసి నాని మ‌రీ విల‌నిజం ఎక్కువ‌గా ఉన్న పాత్ర‌లో న‌టించాడా ఏంటీ? అని చ‌ర్చించుకుంటున్నారు. నానిని హీరోని చేసిన మోహ‌న‌కృష్ణ‌నే ఇప్పుడు విల‌న్‌గా మార్చేశాడు. నాని ఈ చిత్రంలో రాక్ష‌సుడిగా క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ చెబుతున్నారు. కానీ పోస్ట‌ర్ విడుద‌ల త‌ర్వాత చూస్తే మ‌రీ క్రూర‌త్వం ఎక్కువ‌గా ఉన్న రాక్ష‌సుడిగా చూపించారా అనే అనుమానాలు ఎక్కువ‌వుతున్నాయి. కానీ ఇంద్ర‌గంటి మాత్రం `నానిలో ఈ కోణాన్ని చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది` అంటున్నాడు. మ‌రి నాని అసలు అవ‌తారం, ఆయ‌న‌లోని `వి`ల‌నిజం చూడాలంటే ఉగాది వ‌ర‌కు ఆగాల్సిందే. నాని, సుధీర్‌బాబు న‌టించిన `వి` సినిమా అప్పుడే విడుద‌ల కాబోతోంది.