నాని-శ్రీ‌రెడ్డి డర్టీపిక్చ‌ర్‌

Last Updated on by

నేచుర‌ల్‌స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ప‌రంగా పీక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే నాని బుల్లితెర వ్యాఖ్యాత‌గా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ రియాలిటీ షో స్టార్‌-మా చానెల్‌లో ప్రారంభం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ షోలో శ్రీ‌రెడ్డి ఒక పార్టిసిపెంట్‌గా ఎంపికైందని ప్ర‌చారం సాగుతోంది. ఆ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డి .. నానీని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ కామెంట్ అభిమానుల్లో అగ్గి రాజేసింది.

నానీ+ శ్రీ‌రెడ్డి = డ‌ర్టీపిక్చ‌ర్‌.. వెన్‌?? క‌మింగ్ సూన్‌ అంటూ శ్రీ‌రెడ్డి స్వ‌యంగా ఎఫ్‌బిలో కామెంట్ పోస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా దీనిపై హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతోంది. అన్న‌ట్టు నానీపై శ్రీ‌రెడ్డి తీవ్ర‌మైన కామెంట్ల‌తో విరుచుకుప‌డ‌డం ఇదే కొత్తేమీ కాదు. ఇదివ‌ర‌కూ నానీ క్యారెక్ట‌ర్‌ని బ్యాడ్ చేస్తూ శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమార‌మే రేపాయి. నేచుర‌ల్‌స్టార్ కొంద‌రు అమ్మాయిల జీవితాల‌తో ఆడుకున్నాడు.. అంటూ శ్రీ‌రెడ్డి కామెంట్ చేసింది. నానీ ఈగో ఉన్న హీరో. అత‌డి యాటిట్యూడ్ బ్యాడ్‌. రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ లాంటి స్టార్ల‌ను చూసి నేర్చుకోవాల‌ని సూచించింది. అయితే దీనిని నాని అప్ప‌ట్లో అస్స‌లు స్పందించ‌క‌పోవ‌డంపైనా వాడి వేడిగా చ‌ర్చ సాగింది. అయితే అంతా అయిపోయింది అనుకుంటుండ‌గానే మ‌రోసారి డ‌ర్టిపిక్చ‌ర్ పేరుతో ఇలా శ్రీ‌రెడ్డి మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లెట్టింది. శ్రీ‌రెడ్డి కామెంట్‌కి నాని అభిమానులు తీవ్రంగా హ‌ర్ట‌యి.. శ్రీ‌రెడ్డిపై కౌంట‌ర్ ఎటాక్‌ని స్టార్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో సూటి పోటి మాట‌ల‌తో శ్రీ‌రెడ్డిపైనా అట‌కాయించారు. మొత్తానికి శ్రీ‌రెడ్డిని జ‌నం మ‌ర్చిపోయారు అనుకుంటుండ‌గానే, ఇలా కొత్త‌గా మ‌రోసారి ఆట మొద‌లు పెట్టింది. ఇదివ‌ర‌కూ శ్రీ‌రెడ్డి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలానే త‌న‌పై క్రిమిన‌ల్ కేసును న‌మోదు చేయ‌డంపై వాడి వేడిగా చ‌ర్చ సాగింది. ఇంత‌కీ నాని- శ్రీ‌రెడ్డి డ‌ర్టీపిక్చ‌ర్ క‌థాక‌మామీషు ఏంటో శ్రీ‌రెడ్డి ఎప్పుడు ఏం రివీల్ చేస్తుందో .. ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌!

User Comments