ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌ టైటిల్?

Last Updated on by

నాని- సుధీర్ బాబు- ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ కాంబినేష‌న్ లో ఓ మల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ని ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ టైటిల్ ఏంటి? అంటే.. `వ్యూహం` అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది.

నాని హీరోగా అష్టాచెమ్మా, జెంటిల్‌మేన్ చిత్రాల్ని రూపొందించారు ఇంద్ర‌గంటి. వ్యూహం ఆ ఇద్ద‌రికీ హ్యాట్రిక్ సినిమా కాబోతోంది. అలాగే `స‌మ్మోహ‌నం` లాంటి హిట్ చిత్రాన్ని ఇంద్ర‌గంటి సుధీర్ బాబుకు అందించారు. ఇప్పుడు సుధీర్ బాబుతో ఇంద్ర‌గంటికి రెండో సినిమా. ముగ్గురు హిట్ కాంబో క‌లిసి చేస్తున్న ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా వ్యూహం చిత్రానికి పాపులారిటీ ద‌క్క‌నుంది. నాని జెర్సీ త‌ర్వాత విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే ఇంద్ర‌గంటితో సినిమాకి రెడీ అవుతాడు. అలాగే సుధీర్ బాబు ప్ర‌స్తుత ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప్రిపేర‌వుతాడ‌ని తెలుస్తోంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ లో అదితీరావ్ హైద‌రీ ఓ క‌థానాయిక‌గా ఎంపికైంది. ఆస‌క్తిక‌రంగా ఇంద్ర‌గంటి సినిమాకి నాని స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజైన ఎఫ్ 2 గ్రాండ్ స‌క్సెస్ తో మ‌ల్టీస్టార‌ర్ల‌కు మ‌రింత బూస్ట్ ద‌క్కింద‌నే చెప్పాలి.

User Comments