స్వ‌ప్న రుణం తీర్చుకుంటున్న నాని

Last Updated on by

స్వ‌ప్నా.. ఆమెకు నాని రుణ‌ప‌డ్డాడా..? ఇంత‌కీ ఎవ‌రా స్వ‌ప్నా అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాను గుర్తు చేసుకోండి. ఆ సినిమా నిర్మాతే స్వ‌ప్నద‌త్. అశ్వినీద‌త్ కుమార్తె ఈమె. అప్ప‌ట్లో నాని క‌ష్టాల్లో ఉన్న‌పుడు ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం వ‌చ్చి మ‌నోడికి మంచి బ్రేక్ ఇచ్చింది. నాని కెరీర్ ఎటు వెళ్తుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో.. వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపుల‌తో డీలా ప‌డిన పొజిష‌న్ లో స్వ‌ప్న ద‌త్ ప్రొడ‌క్ష‌న్ నుంచి నాగ్ అశ్విన్ వ‌చ్చి నానికి ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం క‌థ చెప్పాడు. ఆ సినిమా చేసిన ముహూర్త‌మో ఏమో కానీ వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాల‌ను అందుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్.

ఈ మ‌ధ్యే కృష్ణార్జున యుద్ధంతో ఈయ‌న జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. త‌న కెరీర్ కు అంత మంచి బ్రేక్ ఇచ్చిన స్వ‌ప్న ద‌త్ కు ఇప్పుడు త‌న వంతు సాయం చేస్తున్నాడు నాని. మ‌హాన‌టి క్యారెక్ట‌ర్ ఇంట్రోల‌కు సంబంధించిన అన్ని ప్రోమోల‌కు త‌న వాయిస్ ఇచ్చాడు నాని. కేవీ రెడ్డి.. ఎల్వీ ప్ర‌సాద్.. ఎస్వీఆర్.. సుశీల‌.. అల‌మేలు.. చక్రపాణి.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రి ఇంట్రోకు నాని వాయిస్ ఓవ‌ర్ అట్రాక్ష‌న్ గా మారిపోయింది. ఇందులో నాని న‌టించ‌లేద‌నే మాటే కానీ సినిమాతో చాలా బంధం పెన‌వేసుకుని పోయాడు. మొత్తానికి అప్పుడు తన‌కు ఇచ్చిన హిట్ కు ఇప్పుడు ఇలా రుణం తీర్చుకుంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్.

User Comments