టైటిల్ కు న్యాయం చేసిన నాని..

నాని ఏం చేసినా న్యాచుర‌ల్ గా ఉంటుంది. అందుకే ఆయ‌న్ని న్యాచుర‌ల్ స్టార్ అంటారు. ఇప్పుడు ఎంసిఏ ఫ‌స్ట్ లుక్ లో కూడా నాని ఎంత న్యాచుర‌ల్ అవ‌తారంలో క‌నిపిస్తున్నాడో..? ఎంసిఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అని అర్థం. అంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అబ్బాయి అని అర్థం. మ‌రి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి..? ఇప్పుడు నానిని చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. త‌న ఇంటి కోసం పొద్దున్నే లేచి బ‌జార్ కు వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకొస్తున్నాడు నాని. సినిమా కూడా ఇంతే న్యాచుర‌ల్ గా ఉంటుందంటున్నాడు నిర్మాత దిల్ రాజు. వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో న్యాచుర‌ల్ స్టార్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ నేప‌థ్యంలో ఎంసిఏ తెర‌కెక్కుతుంది. కెరీర్ లో తొలిసారి తెలంగాణ యాస‌లో మాట్లాడ‌బోతున్నాడు నాని. ఇక సాయిప‌ల్ల‌వి గురించి చెప్పేదేముంది..? ఈ ఇద్ద‌రు క‌లిస్తే స్క్రీన్ షేకే. ఈ సంద‌డి క్రిస్ మ‌స్ కు క‌న‌బ‌డ‌నుంది. ఎంసిఏ అప్పుడే విడుద‌ల కానుంది. మొత్తానికి పాల‌ప్యాకెట్లు ప‌ట్టుకుని లుంగీ క‌ట్టుకుని న‌డుస్తున్న నానిని చూస్తుంటే శ్రీ‌మంతుడులో మ‌హేశ్ క‌ట్టిన లుంగీ సీన్ గుర్తుకొస్తుంది.

Follow US