నీడ పోయిందా.. మ‌రి కొత్త‌గా ఉందే..!

ఈ రోజుల్లో ఓ సినిమా చూడ్డానికి ప్రేక్ష‌కుడు థియేట‌ర్ కు రావాలంటే చాలా క‌ష్టం. స్టార్ హీరో ఉన్నా కూడా కాస్త ఆలోచించి కానీ థియేట‌ర్స్ లోకి అడుగు పెట్ట‌డం లేదు. అలాంటిది చిన్న సినిమా వైపు చూడాలంటే అందులో విష‌యం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు ఇదే ట్రై చేస్తున్నాడు నెపోలియ‌న్.

ఇంత‌కీ ఈ నెపోలియ‌న్ ఎవ‌రు అనుకుంటున్నారా..? ప‌్ర‌తినిథి సినిమా గుర్తుందా.. ఆ సినిమాకు క‌థ‌, మాట‌లు రాసిన ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌వి చేస్తోన్న సినిమా ఇది. చిన్న సినిమానే కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. నీడ క‌నిపించ‌ట్లేద‌ని ఓ మ‌నిషి వ‌చ్చి పోలీస్ స్టేష‌న్ లో కంప్లైంట్ ఇస్తాడు. దానికి ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఆశ్చ‌ర్య‌పోయి చూస్తుంటాడు. అక్క‌డితో నెపోలియ‌న్ అనే టైటిల్ ప‌డుతుంది. సింపుల్ గా ఇది ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ క‌థ‌.

ప్ర‌తినిథి లాంటి సినిమాకు క‌థ అందించిన ఆనంద్ ర‌వి.. ఇప్పుడు నెపోలియ‌న్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇందులో తానే హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ టెక్నిక‌ల్ గా చాలా బాగుంది. ముఖ్యంగా నీడ కోసం కెమెరా కోణాల్ని వాడుకున్న తీరు అద్భుతం. పోలీస్ నీడ ముందు మ‌రో నీడ క‌నిపించ‌కుండా పోవ‌డం.. ఆ త‌ర్వాత కంప్లైంట్ ఇవ్వ‌డం.. ఇవ‌న్నీ కొత్త‌గా ఉన్నాయి. మ‌రి సినిమా కూడా ఇంతే కొత్త‌గా ఉంటుందేమో..! న‌వంబ‌ర్ లోనే సినిమా విడుదల కానుంది.