బుర‌ద జ‌ల్లొద్దు..ప‌నులు చేయండి!

Last Updated on by

తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన 55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక‌ అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమ‌ని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేసారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశలు చంద్రబాబు నాయుడు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు. ఇప్పటికైనా బీజేపీ వైకాపా నాయకులు తెదేపా మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిదని ట్విట్టర్ లో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

User Comments