`గూఢ‌చారి`కి మంత్రి ప్ర‌శంస‌

Last Updated on by

అడివి శేష్ న‌టించిన స్పై థ్రిల్ల‌ర్‌ `గుఢ‌చారి` డీసెంట్ హిట్ అన్న టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో పెర్ఫెక్ట్ స్పై థ్రిల్ల‌ర్ అన్న‌ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో ఈ సినిమాకి ఆద‌ర‌ణ పెరుగుతోంది. ప్ర‌స్తుతం మ‌ల్టీప్లెక్సుల్లో మ‌రిన్ని స్క్రీన్లు పెంచేందుకు యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది. స‌క్సెస్ హుషారులో ప్ర‌స్తుతం యూనిట్ సెల‌బ్రేష‌న్ మూడ్‌లో ఉంది. మ‌రోవైపు భారీగా విజ‌యోత్స‌వ‌ సెల‌బ్రేష‌న్స్‌కి ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవ‌లే సినిమా వీక్షించిన మ‌హేష్ చిత్ర‌యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించార‌ని, త‌న పాత్ర బాగా న‌చ్చింద‌ని అన్నార‌ని లేడీ గూఢ‌చారి సుప్రియ తెలిపారు. ప్ర‌స్తుతం గూఢ‌చారి టీమ్‌కి ఏపీ మంత్రి నారా లోకేష్ నుంచి అదిరిపోయే ప్ర‌శంస ద‌క్కింది. “చ‌క్క‌ని ఫాస్ట్ ఫేస్‌డ్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. గూఢ‌చారి చిత్రాన్ని ప్ర‌తి నిమిషం ఎంజాయ్ చేశాను. అడివి శేష్‌, శోభిత ధూళిపాల‌, ప్ర‌కాష్ రాజ్‌ల న‌ట‌న మైమ‌రిపించింది. శ‌శికిర‌ణ్ ప‌నిత‌నం భేష్‌“ అంటూ పొగిడేశారు. ఈ ఆదివారం సాయంత్రం లోకేష్ కోసం యూనిట్ ఓ స్పెష‌ల్ షోని వేసింది. గూఢ‌చారి రెండు రోజుల్లో దాదాపు 3కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింది. అలానే తొలి వీకెండ్ నాటికే అమెరికాలో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో అడుగుపెట్ట‌నుంద‌ని తెలుస్తోంది.

User Comments