న‌రేష్, సునీల్ పారితోషికాలివీ

Last Updated on by

రూటు మార్చి తిరిగి పాత దారిలోకి వ‌చ్చేశాడు సునీల్‌. స‌హాయ న‌టుడిగా కామెడీ పాత్ర‌ల‌కు ఓకే చెబుతున్నాడు. ఇప్ప‌టికే నాలుగైదు సినిమాల‌కు సంత‌కాలు చేసేశాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌`లో ఫుల్ లెంగ్త్ క‌మెడియ‌న్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఓ ర‌కంగా ఈసినిమా అత‌డికి పున‌ర్జ‌న్మ‌లాంటిదే. స్నేహితుడు త్రివిక్ర‌మ్ అదిరిపోయే పాత్ర‌ను అప్ప‌జెప్పి సునీల్‌ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చేందుకు స‌న్నాహాలు చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమాకి సునీల్ పారితోషిక ఎంత‌? అంటే.. షాక్ తిన‌కుండా ఉండ‌లేం. ప‌రిమిత కాల్షీట్ల‌కే అత‌డు ఏకంగా 1.25కోట్లు అందుకుంటున్నాడ‌ట‌.

ఇక‌పోతే సునీల్, అల్లరి న‌రేష్ క‌లిసి `సిల్లీ ఫెలోస్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కోసం ఆ ఇద్ద‌రి పారితోషికాలు సేమ్ టు సేమ్‌గా ఉన్నాయిట‌. కోటి పైగా పారితోషికం అందుకుంటున్నార‌ని తెలుస్తోంది. సుడిగాడు ఫేం భీమ‌నేని త‌మ‌కో హిట్టిస్తార‌ని ఆ ఇద్ద‌రూ ఎంతో క‌సిగా న‌టించార‌ట‌. ఒక‌వేళ ఈ సినిమా హిట్ట‌యితే దీనికి కొన‌సాగింపును ప్లాన్ చేసే అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌లేమ‌ని చెబుతున్నారు.

User Comments