ఫ‌స్ట్‌లుక్ : శౌర్య న‌ర్త‌న అద‌ర‌హో

Last Updated on by

ఛ‌లో, అమ్మ‌మ్మ‌గారిల్లు చిత్రాల‌తో బంపర్‌హిట్లు కొట్టాడు నాగ‌శౌర్య‌. క‌థ‌, కంటెంట్‌ని న‌మ్మి కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి తెలివిగా హిట్లు కొడుతున్న హీరోగా అత‌డు పేరు తెచ్చుకుంటున్నాడు. శౌర్య సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్ష్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడు. న‌ర్త‌న‌శాల అనేది టైటిల్‌. శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. శౌర్య డాడ్ శంక‌ర్‌ ప్ర‌సాద్ ముల్‌పురి స‌మ‌ర్ప‌ణ‌లో అత‌డి మాతృమూర్తి ఉషా ముల్‌పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరంభ‌మే టైటిల్ ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి, శౌర్య లుక్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్సాహం అభిమానుల్లో పెరిగింది.

narthanasala first look talk

అందుకు త‌గ్గ‌ట్టే అన్ని అంచ‌నాల్ని అందుకునే పోస్ట‌ర్ వ‌చ్చేసింది. తాజాగా న‌ర్త‌న‌శాలలో శౌర్య లుక్‌ని లాంచ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అత‌డు ఎంతో ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తున్నాడు. న‌ర్త‌న అన్నది టైటిల్‌లోనే ఉంది కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టే అత‌డు న‌ర్తించి చూపించాడు. 1000 వాట్స్ విద్యుత్ ఒకేసారి శ‌రీరంలోకి పాకిన‌ట్టు అంతెత్తున‌ గాల్లో లేచి అంతే ఉల్లాసంగా క‌నిపిస్తున్నాడు. ప‌సుపు కుర్తా, తెల్ల పంచె, న‌ల్ల బూటుతో గాల్లో లేచిన శౌర్య ఎంతో హుందాగా క‌నిపిస్తున్నాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్‌లో ఏదో మ‌ర్మం దాగి ఉంద‌ని అనిపిస్తోంది. గోపిచంద్ సాహ‌సం ఫ‌స్ట్‌లుక్ త‌ర‌హాలోనే వీక్ష‌కుల గుండెల‌పై బ‌ల‌మైన ముద్ర వేస్తోంది ఈ పోస్ట‌ర్‌. శౌర్య‌లో ఈ ఉత్సాహం ఇలానే సాగ‌నీ. హిట్టు వెంట హిట్టు కొట్ట‌నీ. ఈసారి హ్యాట్రిక్ అందుకోనిద్దాం.

User Comments