సామాన్యుడిలా క‌టిక నేల‌పై జ‌న‌సేనుడు!

Last Updated on by

Last updated on March 26th, 2019 at 02:44 pm

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సామాన్యుడిలా త‌న హోదాను మ‌రిచి మ‌రోసారి త‌న సింపుల్ సిటీని చాటుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. 50 కోట్లు పారితోషికం తీసుకునే వీలున్న, ప‌ట్టు పాన్పుల్లో ప‌వ‌లించే అవ‌కాశం వున్నా..త‌నకు ఆతిథ్యం ఇవ్వ‌డానికి స్టార్ హోట‌ళ్లు ఎదురుచూస్తున్నా క‌టిక నేల పై కూర్చుని ఓ సామాన్యుడిలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ భోజ‌నం చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఈ అరుదైన దృశ్యం కృష్ణాజిల్లా మంగ‌న‌పూడి బీచ్ లైట్ హౌజ్ వ‌ద్ద చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లాలో త‌న అభ్య‌ర్థుల త‌రుపున ప్ర‌చారం మొద‌లుపెట్టాన ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ప్ర‌చారం హోరెత్తించారు. అయితే కొంత విరామం తీసుకోవ‌డం కోసం మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగ‌న‌పూడి బీచ్ లైట్ హౌజ్ వ‌ద్ద గ‌ల ఓ చెట్టుకిందికి చేరిన ప‌వ‌న్ నేల‌పై కూర్చుని మ‌ట్టి పాత్ర‌లో భోజ‌నం చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. జొన్న అన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకుని ప‌చ్చిమిర‌ప‌కాయ్ ప‌చ్చ‌డిని నంజుకుంటూ అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ప‌వ‌న్ ఆస్వాదిస్తూ భోజ‌నం ఆర‌గించారు. భోజ‌నం ముగించుకున్న అనంత‌రం వేప‌చెట్టుకింద తాటాకు చాప‌పై సేద‌తీరిన ఫొటోలు, వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read: Small Actors Proving Loyal To Pawan Kalyan

User Comments