బాంబులేస్తా.. ప్రాణాలు తీస్తా: బాల‌కృష్ణ‌

Last Updated on by

గ‌త కొంత కాలం నుంచి హీరో నంద‌మూరి బాల‌య్య వ్య‌వ‌హార శైలి చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న విష‌యం తెలిసిందే. త‌న‌కు ఎవ‌రు అడ్డుగా వ‌చ్చినా..చిరాకు తెప్పించేలా ప్ర‌వ‌ర్తించిన అస‌హ‌నంతో బాల‌య్య రెచ్చిపోయి సోష‌ల్ మీడియాలో బుక్క‌వుతున్నారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ త‌న అన్న కూతురు సుహాసిని కోసం కూక‌ట్‌ప‌ల్లి రోడ్ షోలో పాల్గొన్న బాల‌య్య త‌న‌కు రాని రాసే జ‌హాసె అచ్చా గీతాన్ని ట్రై చేసి హే బుల్ హే బుల్ హే బుల్ అంటూ ట్రోల‌ర్స్ చేతిలో దారుణంగా బుక్క‌యిన విష‌యం తెలిసిందే. ఆ సంఘ‌ట‌న‌కు ముందే అన్న హ‌రికృష్ణ మ‌ర‌ణంతో సంభ్ర‌మాశ్చ‌ర్యానికి గుర‌య్యాన‌ని చెప్పి దారుణ‌మైన షాకిచ్చారు.
తాజాగా ఓ ఫ్యాక్ష‌నిస్టులా ఓ మీడియా కెమెరామెన్‌పై భారీ డైలాగులు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బుధ‌వారం అనంత‌పురం జిల్లా హిందూపురంలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్న బాల‌కృష్ణ ఓ మీడియా కెమెరామెన్‌పై వీరంగం చేశారు. బాల‌య్య వ‌స్తున్నాడ‌ని వేచి చూస్తున్న చిన్ని పిల్ల‌ల‌ని బాల‌య్య వ్య‌క్తిగ‌త సిబ్బంది ప‌క్క‌కు లాగేయ‌డంతో ఆ దృశ్యాల‌ను ఓ మీడియాకు చెందిన కెమెరామెన్ షూట్ చేశాడు. అయితే అది గ‌మ‌నించిన బాల‌కృష్ణ ఫ్యాక్ష‌నిస్టులా కెమెరామెన్‌పై రెచ్చిపోయారు. `రాస్కెల్ న‌రికి పోగులు పెడ‌తా. ప్రాణాలు తీస్తా. బాంబులు వేయ‌డం కూడా నాకు తెలుసు. క‌త్తి తిప్ప‌డం తెలుసు` అంటూ బాల‌య్య బెదిరించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాల‌య్య దుంప తెంపేస్తోంది. నెటిజ‌న్‌లు  ఈ వీడియోపై కుళ్లు జోకులు వేస్తూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు. ఏంది బాల‌య్యా ఇది అంటూ అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

User Comments