స‌మంత‌కు జాతీయ అవార్డ్‌?

Last Updated on by

అక్కినేని కోడ‌లు స‌మంత‌కు జాతీయ అవార్డ్ వ‌స్తుందా? రాదా? .. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. అస‌లు స‌మంత అందుకు అర్హ‌మా.. కాదా? వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన స‌మంత న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లోనే న‌టించింది. రంగ‌స్థ‌లం రామ‌ల‌క్ష్మిగా, మ‌హాన‌టి మ‌ధుర‌వాణిగా, అభిమ‌న్యుడులో సైక్రియాటిస్టుగా న‌టించి మెప్పించింది. ఈ పాత్ర‌ల‌న్నీ అభిన‌యానికి ఆస్కారం ఉన్న‌వే. అయితే ఇవేవీ సామ్‌కి జాతీయ పుర‌స్కారం అందించ‌లేవా? అస‌లు త‌ను అందుకు అర్హురాలు కానే కాదా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2018 జాతీయ పుర‌స్కారాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి, ఈ ఏడాది సినిమాలు 2019 జాతీయ అవార్డుల రేసులో ఉంటాయి. అంటే సామ్ న‌ట‌న‌ను జాతీయ అవార్డ్ క‌మిటీ నామినేష‌న్‌కు అయినా తీసుకుంటుందా? అన్న‌ది చూడాలి.

రంగ‌స్థ‌లంలో ప‌ల్లెటూరి పిల్ల రామ‌ల‌క్ష్మిగా గోదారి యాక్సెంట్‌తో అద‌ర‌గొట్టేసింది స‌మంత‌. ఆ క‌ట్టు బొట్టు, సాంప్ర‌దాయాన్ని ఆవిష్క‌రించింది. ఇక‌పోతే మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి జీవితాన్ని ప‌రిశోధించే పాత‌కాలం అమాయ‌కు జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా స‌హాయ‌క పాత్ర‌లో జీవించింది. తండ్రిని ఎదిరించే, ప్రియుడి కోసం లూనాని సింగిల్ కిక్‌లో స్టార్ట్ చేసే ప్రేమికురాలిగా క‌నిపించింది. ఇక‌పోతే అభిమ‌న్యుడు చిత్రంలో ల‌వ్‌ డాక్ట‌ర‌మ్మ‌గా సామ్ న‌ట‌న అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. అందుకే క‌థానాయిక‌గా లేదా, క‌నీసం స‌హాయ‌న‌టి గా అయినా జాతీయ పుర‌స్కారం అందుకునే ఛాన్స్ ఉందా లేదా.. అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌పోతే సామ్ ఓ అరుదైన అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. `మ‌హాన‌టి` చిత్రంలో మ‌ధుర‌వాణిగా స‌హాయ‌క పాత్ర‌కు మెల్‌బోర్న్ ఐఎఫ్ఎఫ్ఎం 2018 అవార్డ్‌ల్లో నామినేష‌న్ వేశారు. ఇక స‌మంత‌తో పాటు సంజు చిత్రంలో న‌టించిన విక్కీ కౌశ‌ల్, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ ఫేం మెహెర్ విజ్‌, ల‌వ్ సానియా ఫేం రిచా చ‌ద్దాలు స‌హాయ‌క పాత్ర‌ల‌కు నామినేట్ అయ్యారు. సామ్‌కు పుర‌స్కారం ద‌క్కుతుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

User Comments