నేచుర‌ల్ స్టార్ సాహ‌సాలు

Nani

నాని- సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో  ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వంలో `వీ` ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో నాని విల‌న్ గా న‌టిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ త‌ర్వాత పూర్తిగా `వీ`పైనే నాని శ్ర‌ద్ధ పెట్టి న‌టిస్తున్నాడు. ఈ చిత్రంతో తిరిగి కంబ్యాక్ హిట్ సాధిస్తాన‌న్న ధీమాతో ఉన్నాడు. అయితే ఈ సినిమా త‌ర్వాత నాని ఏ చిత్రంలో న‌టిస్తారు? అంటే..

ఇంత‌వ‌ర‌కూ స‌రైన ఆన్స‌ర్ లేదు. నానీ కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు స్క్రిప్టుల‌తో సిద్ధంగా ఉన్నారు. కానీ అత‌డు ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ కి ఓకే చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌లే డెబ్యూ ద‌ర్శ‌కుడు మ‌హేష్ నానికి స్క్రిప్టు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్ పై నానీనే స్వ‌యంగా నిర్మించ‌నున్నాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. న‌వ‌త‌రాన్ని ప్రోత్స‌హిస్తూ సాహ‌సాలు చేయ‌డంలో నాని త‌ర్వాత‌నే అని అర్థ‌మ‌వుతోంది క‌దూ?