నాని-సాయి పల్లవి ఎంసిఏ మూవీ హైలైట్స్

తెర‌పై కెమిస్ట్రీ స‌రిగ్గా కుద‌రాలంటే స‌మవుజ్జీలు ఉండాలి. ఏ ఒక్క‌రు త‌క్కువైనా.. రెండో వారు రెచ్చిపోతారు. నాని విష‌యంలో ఇన్నాళ్లూ ఇదే జ‌రిగిందేమో..? ఈయ‌న త‌న హీరోయిన్ల‌ను పూర్తిగా ఔట్ ఫోక‌స్ చేసాడు ఇన్నాళ్లూ. ఈయ‌న‌కు స‌రైన న‌టి ఇప్ప‌టి వ‌ర‌కు దొర‌క‌లేద‌నే చెప్పాలి. కొద్దోగొప్పో నివేదా థామ‌స్ ఓకే కానీ ఆమె కూడా పూర్తిగా నానిని డామినేట్ చేయలేదు. ఇక ఇప్పుడు రొమాన్స్ కైనా.. కెమిస్ట్రీకైనా నీకు నేనే పోటీ అంటూ సాయిప‌ల్ల‌వి వ‌చ్చేస్తుంది. ఎంసిఏలో ఒక్కోపాట‌.. స్టిల్ విడుద‌ల‌వుతున్న కొద్దీ అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ తెర‌పై క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఎంసిఏ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. అన్నింట్లోను సాయిప‌ల్ల‌వి, నాని మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. మొన్న విడుద‌లైన పాట‌లో అయితే ఇద్ద‌రూ ఆక‌ట్టుకున్నారు.

Natural star Nani & Sai Pallavi MCA Movie Highlightsఇక ఇప్పుడు ఏమయిందో నాకు అనే పాట విడుద‌లైంది. ఈ పాట‌లోనూ ఇద్ద‌రి రొమాన్స్ అదిరిపోయింది. మొన్న విడుద‌లైన కొత్త‌గా కొత్త‌గా సాంగ్ కూడా చాలా పెద్ద హిట్టైంది. ఇందులోనూ నాని, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇక ఇప్పుడు వ‌చ్చిన పాట‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేసారు ఈ జోడీ. దాంతో ఎంసిఏపై ఆస‌క్తితో పాటు అంచ‌నాలు కూడా చాలా పెరిగాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి బంధాలు, అనుబంధాలే మెయిన్ బేస్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్. మొత్తానికి ఎంసిఏ మ్యూజిక్ ప‌రంగా సూప‌ర్ హిట్. పూర్తిపాట‌లు డిసెంబ‌ర్ 11న విడుద‌ల కానున్నాయి.. అదే రోజు ట్రైల‌ర్ కూడా రానుంది. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ క‌లిసి ఎంసిఏ ను ఏ రేంజ్ కు తీసుకెళ్ల‌నున్నారో..?