ఇప్పుడు నవదీప్ ను దించుతున్న ఎన్టీఆర్

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ను బాగానే నడిపిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ ఇప్పుడు వీకెండ్ వచ్చేయడంతో.. ఎన్టీఆర్ చేసే హంగామా కోసం ఫ్యాన్స్ కూడా బాగానే వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యే ఆ సెలబ్రిటీ ఎవరో చూడాలనే ఆతృత కూడా జనాల్లో బాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల దీక్షాపంత్ ను దించి షో కు హాట్ నెస్ తెచ్చినట్లు.. ఇప్పుడు ఏ హాట్ బ్యూటీని దించి మసాలా యాడ్ చేస్తారని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ హాట్ బ్యూటీని దించడం లేదని, ఎప్పుడూ వివాదాల్లో ఉండే యంగ్ హీరో నవదీప్ ను దించుతున్నాడని తెలియడం గమనార్హం.
ఈ మేరకు బిగ్ బాస్ ఆహ్వానాన్ని మన్నించి హౌస్ లో గడపడానికి నవదీప్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. అందులోనూ తాజాగా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’ మినహా నవదీప్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలూ లేకపోవడం కూడా బిగ్ బాస్ కు కలిసొచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని విచారణ ఎదుర్కొన్న నవదీప్.. గతంలో కూడా చిన్న చిన్న వివాదాల్లో చిక్కకున్న విషయం అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు నవదీప్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే.. మంచి డ్రామా నడుస్తుందని, షో కి కావాల్సిన రచ్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న ముమైత్ ఖాన్ కూడా లోపలే ఉండటంతో.. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండుతుందని కామెంట్లు పడుతున్నాయి. మరి ఈ లెక్కన నవదీప్ ఎంట్రీ నిజంగానే ఉంటే, బిగ్ బాస్ కు ఏ రేంజ్ లో లాభం ఉంటుందో చూడాలి.