ఐఫాలో మామ్‌ శ్రీ‌దేవికి ప‌ట్టం

Last Updated on by

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణం ఓ మిస్ట‌రీగానే మిగిలిపోయింది. దుబాయ్ పోలీస్ క్లీన్ చిట్ ఇచ్చినా ఈ మ‌ర‌ణంపై అనుమానాలున్నాయంటూ ఇదివ‌ర‌కూ దిల్లీకి చెందిన ఓ లాయ‌ర్ కోర్టులో పున‌ర్విచార‌ణ‌కు కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల్లో ఇప్ప‌టికీ సందేహాలు అలానే ఉన్నాయి. ఈ ఆక‌స్మిక మ‌ర‌ణం జీర్ణించుకోలేనిది. మామ్ శ్రీ‌దేవి స్వ‌ర్గ‌లోకంలో సేద‌దీరుతున్నారు. ఆ క్ర‌మంలోనే త‌న న‌ట‌వార‌సురాలు జాన్వీ న‌టించిన తొలి చిత్రం ధ‌డ‌క్ రిలీజ్‌కి వ‌చ్చేస్తోంది.

అదంతా అటుంచితే ప్ర‌స్తుతం దుబాయ్‌లో సాగుతున్న `ఐఫా -2018 అవార్డ్స్‌` వేడుక‌ల్లో శ్రీ‌దేవి `మామ్` చిత్రం మెరుపులు మెరిపిస్తోంది. ఈ సినిమా ప‌లు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఉత్త‌మ స‌హాయ‌న‌టుడిగా న‌వాజుద్దీన్ సిద్ధిఖి పుర‌స్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డును మామ్ శ్రీ‌దేవికి అంకిత‌మిస్తున్నాన‌ని అత‌డు ప్ర‌క‌టించారు. మూడు రోజులుగా బ్యాంకాక్‌లో ఐఫా ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్నాయి. నిన్న‌టి పుర‌స్కారాల్లో త‌ళుకుబెళుకుల ప్ర‌పంచం క‌న్నుల పండువ చేసింది.

User Comments