న‌వాజుద్దీన్ న్యూడ్ సీన్స్..

Last Updated on by

బాలీవుడ్ హ‌ద్దులు దాటేస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే నిజ‌మే అనిపిస్తుంది. క‌థ పేరు చెప్పి.. ఏది ప‌డితే అది చేస్తున్నారు. ఇప్పుడు న‌వాజుద్దిన్ సిద్ధిఖీ కూడా ఇదే దారిలో వెళ్లాడు. ఈయ‌న బాలీవుడ్ లో ఉన్న ఫైనెస్ట్ యాక్ట‌ర్స్ లో ఒక‌రు. ఈ మ‌ధ్యే సక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ వ‌చ్చింది బాలీవుడ్ లో. విక్ర‌మాదిత్య మొత్వానేతో పాటు అనురాగ్ క‌శ్య‌ప్ దీన్ని తెర‌కెక్కించారు. ఆరు గంట‌ల నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ లో యాక్ష‌న్ సీన్స్ తో పాటు న్యూడ్ సీన్స్ కు కూడా కొద‌వ‌లేదు. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌ప్ఫాడించాడు.

ఇక న‌వాజుద్దిన్ అయితే ఈ వెబ్ సిరీస్ లో కొత్త రూపం చూపించాడు. ఏకంగా న్యూడ్ సీన్స్ చేసి బాపురే అనిపించాడు. ఏ మాత్రం సంకోచించ‌కుండా ఏకంగా న్యూడ్ సీన్స్ లో న‌టించేసి.. పిచ్చెక్కించాడు ఈయ‌న‌. ఇలాంటి సీన్స్ చేసిన త‌ర్వాత బాలీవుడ్ లో ఆఫ‌ర్లు వ‌స్తాయా రావా అనే సంగ‌తి కూడా ఆలోచించ‌డం లేదు ఈయ‌న. ఆ మ‌ధ్య రాధికా ఆప్టే కూడా పార్చ్డ్ లో క‌థ‌కు అవ‌స‌ర‌మైన రీతిలో న్యూడ్ గా రెచ్చిపోయింది. ఇప్పుడు న‌వాజుద్దీన్ కూడా ఇదే చేసి చూపించాడు. ఈయ‌న ర‌చ్చ చూసి బాలీవుడ్ అంతా షాక్ అవుతుంది ఇప్పుడు. సక్రెడ్ గేమ్స్ లో విడుద‌లైన సీన్స్ ఇప్పుడు యూ ట్యూబ్ ను కూడా షేక్ చేస్తున్నాయి.

User Comments