న‌య‌న‌కు హీరోల‌తో ప‌నిలేదేమో..?

సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అంటారు. ఇక్క‌డ హీరోలు చెప్పిందే వేదం అంటారు. కానీ ఇలాంటి ఇండ‌స్ట్రీలో కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది న‌య‌న‌తార‌. గుర్తింపు కాదు అది.. క్రేజ్.. ఇమేజ్.. మార్కెట్.. ఇలా ఎన్ని ప‌దాలుంటే అన్ని న‌య‌న‌తార కోసం వాడేయొచ్చు. ఎందుకంటే హీరోల‌తో ప‌నిలేకుండా మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతుంది ఈ భామ‌.
న‌య‌న‌తార అనే పేరుకు సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న గిరాకీ మాట‌ల్లో చెప్ప‌లేం. అమ్మ‌డు నిర్మాత‌ల పాలిట గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఏ సినిమా చేస్తే అది సూప‌ర్ హిట్. ముఖ్యంగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అయితే న‌య‌న బొమ్మ క‌నిపిస్తే చాలు నిర్మాత‌లు ఎగ‌బ‌డిపోతున్నారు.
స్టార్ హీరోలు సినిమాలో ఉన్నా.. న‌య‌న‌తార ఇమేజ్ తోనే బొమ్మ‌లు సూప‌ర్ హిట్ అవుతున్నాయి. గ‌త కొన్నేళ్లుగా మాయ‌, తని ఒరువ‌న్, నానుం రౌడీథాన్ సినిమాలు సూప‌ర్ హిట్ట‌య్యాయి. ఇక ఇప్పుడు కూడా న‌య‌న న‌టిస్తోన్న సినిమాల్లో ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ కావ‌డం విశేషం.
పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న ఆర‌మ్ అయినా.. హార్ర‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోన్న కొలైయుతుర్ కాల‌మ్ అయినా న‌య‌నతార‌ క్రేజ్ తోనే రానున్నాయి. ఇందులో బిల్లా 2 ఫేమ్ చ‌క్రి తోలేటి తెర‌కెక్కిస్తోన్న కొలైయుతుర్ కాల‌మ్ హాలీవుడ్ సినిమా హ‌ష్ ఆధారంగా వ‌స్తుంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తానికి ఈ సినిమాల‌న్నీ ఈ ఏడాదే విడుద‌ల కానుండ‌టం మ‌రో విశేషం.