ప్రియుడితో న‌య‌న్ పూజ‌లు

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్- న‌య‌న‌తార ప్రేమ పావురాల్లా విహరిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు చుట్టేసారు. ఈ జంటకు దైవ‌ భ‌క్తి కూడా ఎక్కువ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే గుళ్లు గోపురాలు తిరిగి దేవుళ్లు మొక్కులు తీర్చిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో క‌లిసి నయనతార పూజలు చేశారు. అమ్మవారి దర్శన అనంత‌రం దాదాపు అరగంట ఇద్ద‌రూ ఆలయంలో ఉన్నారు.

నయన్, విఘ్నేష్‌లకు ఆలయ పూజారులు ప్రత్యేక ఆహ్వానాన్ని పలికారు. ప్రస్తుతం నయనతార ఆర్.జె.బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఉన్నంత కాలం అమ్మ‌డు మాంసాహారం జోలికి వెళ్లలేదు. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నయన్ అమ్మవారి పాత్రలో న‌టించింది. తెలుగులో శ్రీరామ రాజ్యం లో సీత పాత్రలో న‌టిస్తోన్న స‌మ‌యంలో న‌య‌న్ మాంసాహారం తీసుకొని సంగ‌తి తెలిసిందే.