వ్య‌క్తిగ‌త విష‌యాలు అడ‌గొద్దు ప్లీజ్

ద‌క్షిణాది హీరోయిన్ల‌లో న‌య‌న‌తార స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంత మంది క‌థానాయ‌కులొచ్చినా త‌న‌కు త‌నే పోటీ. సౌత్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ల‌లో న‌య‌న్ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. హీరోయిన్ గా న‌టిస్తూనే లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె బిజీ షెడ్యూల్ కార‌ణంగా కేవ‌లం త‌మిళ సినిమాల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తోంది. అయితే న‌య‌న్ ఏ సినిమా ప్ర‌చారంలో పాల్గొన‌దు. సినిమాకు సంత‌కం చేసే ముందే అగ్రిమెంట్ లో ఆ కండీష‌న్ త‌ప్ప‌క రాసిస్తుంది. ఆ కండీష‌న్ కి ఒకే అంటేనే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. లేదంటే ఎంత పారితోషికం ఆఫ‌ర్ చేసేనా నిర్మొహ‌మాటంగా నో అని చెప్పేస్తుంది. గ‌త ప‌దేళ్ల కాలంలో ఏ మీడియా సంస్థ‌కు ఆమె ఒక్క ఇంట‌ర్వూ కూడా ఇవ్వ‌లేదు.

అయితే తాజాగా ప్ర‌ముఖ వోగ్ ఇండియాకు మ్యాగ‌జైన్ కు ప‌దేళ్ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వూ ఇచ్చింది. ఇందులో ఆమెనుంచి బోలెడన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు రాబ‌ట్టాల‌ని వోగ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు ముక్కుసూటిగా నో అనే స‌మాధానం చెప్పింది. వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎవ‌రితోనూ పంచుకోవ‌డం ఇష్టం లేద‌ని.. ద‌య చేసి ఇబ్బంది పెట్టొద్ద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేసింది. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటాన‌ని, త‌న వృత్తిప‌ట్ల అంకిత భావం త‌ప్ప ఇత‌ర విష‌యాలు ప‌ట్టించుకోన‌ని తెలిపింది. సినిమాల్లోకి వ‌చ్చి పెద్ద హీరోయిన్ అయ్యాన‌ని ఏ రోజు గ‌ర్వ‌ప‌డ‌లేద‌ని, ఇప్ప‌టికీ న‌టిగా రోజూ భ‌య‌ప‌డుతూనే ఉంటాన‌ని తెలిపింది. ఏ రోజు ఏ పాత్ర త‌న ముందుకొస్తుందోన‌ని, దానికి న్యాయం చేయ‌గ‌ల‌నో? లేదోన‌ని రోజు టెన్ష‌న్ ప‌డుతూనే జీవిస్తున్నాన‌ని తెలిపింది.