న‌య‌న్ లాస్.. జ్యోతిక గెయిన్

Jyothika's Next Officially Launched

Last Updated on by

కింగ్ నాగార్జున హీరోగా `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్ `బంగార్రాజు` సెట్స్ పైకి వెళుతున్న సంగతి తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయి. అయితే  ఈ చిత్రంలో కథానాయిక  ఎవరు అన్న డైలెమా కొనసాగుతోంది.

`బంగార్రాజు` స‌ర‌స‌న క‌థానాయికను వెతుకుతున్నార‌ని నయనతారను సంప్రదిస్తే బిజీ కాల్షీట్లతో కుదరదని చెప్పేసిందని ప్రచారమవుతోంది. న‌య‌న్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న‌ `సైరా-న‌ర‌సింహారెడ్డి`, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న `ద‌ర్బార్` చిత్రాల్లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బిజీ లో కాల్షీట్ల సమస్య తలెత్తిందిట.

దీంతో జ్యోతికను బంగార్రాజు బృందం సంప్రదించారని తెలుస్తోంది.  పెళ్లి తర్వాత జ్యోతిక తిరిగి కెరీర్ పరంగా ఫామ్ లోకి వచ్చారు. తను నటించిన పలు చిత్రాలు విజయవంతం అయ్యాయి. 36 వయదినిలే, నాచియార్ చిత్రాలతో తను ఫామ్ లోకి వచ్చేశారు. ఇటీవలే మణిరత్నం నవాబ్ చిత్రంలోనూ అద్భుత ప్రదర్శనతో మెప్పించారు. అందుకే ఇప్పుడు కింగ్ సరసన జ్యోతిక ఎంపిక సరైనదేనన్న మాటా వినిపిస్తోంది. అయితే  ఈ చిత్రానికి జ్యోతిక ఓకే చెప్పారా.. లేదా? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉందింకా.


Related Posts