న‌య‌న్ సినిమాకు అప్పుడే సీక్వెలా..?

ఈ రోజుల్లో ఓ సినిమా హిట్ట‌య్యేదే ఆల‌స్యం.. దాని రీమేక్ రైట్స్ కోసం మిగిలిన ఇండ‌స్ట్రీలు ఎలా ఎగ‌బ‌డ‌తాయో.. అచ్చంగా సీక్వెల్ చేయ‌డానికి ఆ చిత్ర ద‌ర్శ‌కులు కూడా అలాగే ఆస‌క్తి చూపిస్తుంటారు. కావాలంటే చూడండి.. నిన్న‌గాక మొన్న విడుద‌లైన న‌య‌న‌తార ఆర‌మ్ సినిమాకు అప్పుడే సీక్వెల్ ఆలోచ‌న‌లు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్. సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆర‌మ్ కు కొన‌సాగింపు క‌థ‌ను చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఈ క‌థ‌కు ఆ పొటెన్షియాలిటీ ఉంద‌న్నాడు గోపీనైన‌ర్. ఈ రోజుల్లో హీరోలు ఉన్న సినిమాలే హిట్ కావ‌డం లేదు.. కానీ త‌మిళ‌నాట న‌య‌న‌తార మాత్రం కుమ్మేస్తుంది. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ వ‌ర‌స‌గా సూప‌ర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆర‌మ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తుంది.

ఆర‌మ్ లో న‌య‌న‌తార క‌లెక్ట‌ర్ గా న‌టించింది. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల ఆట క‌ట్టించేలా ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేస్తుంది. ఓ ఊరులో ఉన్న నీటిని కంపెనీలు దోచుకుంటుంటే.. దాన్ని అడ్డుకునే ఐఏఎస్ ఆఫీస‌ర్ గా న‌టించింది న‌య‌న‌తార‌. ఈ చిత్ర స‌క్సెస్ టూర్ కూడా మొద‌లైంది. ఈ సంద‌ర్భం లోనే సీక్వెల్ గురించి చెప్పాడు ద‌ర్శ‌కుడు. దీనికి న‌య‌న్ కూడా సుముఖంగానే క‌నిపిస్తుంది. క‌థ ఉంటే వెంట‌నే సీక్వెల్ ప‌నులు మొద‌లుపెట్టాల‌ని న‌య‌న‌తార కూడా ద‌ర్శ‌కుడికి సూచించింది. దాంతో ప్ర‌స్తుతం ఆయ‌న అదే ప‌నుల్లో ఉన్నారు. తెలుగులో ఆర‌మ్ ను క‌ర్త‌వ్యంగా తీసుకొస్తున్నారు. ఒక‌ప్పుడు విజ‌య‌శాంతి టైటిల్ ఇది. ఇప్పుడు ఆ క్రేజ్ న‌య‌న‌తారకు వ‌చ్చింది. అందుకే ఈ చిత్రానికి ఇదే ప‌ర్ ఫెక్ట్ టైటిల్ అంటున్నాడు గోపీ నైన‌ర్. మొత్తానికి విడుద‌లైన‌ వారం రోజుల్లోనే సీక్వెల్ క‌న్ఫ‌ర్మ్ చేసుకుంది ఆర‌మ్.