న‌య‌న‌తార‌: కాబోయే సిఎం

అదేంటి.. న‌య‌న‌తార కాబోయే సిఎం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఇది న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. ఈమె కాబోయే సిఎం అంటున్నారు. అయితే రియ‌ల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. నిజ‌జీవితంలోనూ ఈమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాల్ని కొట్టి పారేయ‌లేం. సూప‌ర్ ఫాలోయింగ్ ఉన్న న‌య‌న్ ను త‌మ‌వైపు తిప్పుకోడానికి ప్ర‌తీ పార్టీ పోరాడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈమె చేస్తోన్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు కూడా అన్నీ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండ‌టం ఆస‌క్తి పుట్టిస్తుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఆర‌మ్ లో క‌లెక్ట‌ర్ గా న‌టించింది న‌య‌న‌తార‌. ఈ చిత్రంలో ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడి.. చివ‌రికి ఆమె ప‌దవిని సైతం వ‌దిలేసే క‌లెక్ట‌ర్ గా న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తుంది. అంత‌టితో క‌థ ముగుస్తుంది.

ఆర‌మ్ కు సీక్వెల్ ఉంద‌ని.. దానికి క‌థ సిద్ధ‌మ‌వుతుంద‌ని ఇప్ప‌టికే చెప్పాడు ద‌ర్శ‌కుడు గోపీ నైన‌ర్. ఈ చిత్రంలో న‌య‌న‌తార రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. త‌ర్వాత గెలిచి.. రాజ‌కీయాల్లో బ‌ల‌మైన శ‌క్తిగా ఎలా మారింద‌నేది చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు గోపీ. ఈ పాత్ర‌లో జ‌య‌ల‌లిత ఛాయ‌లు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఎంజిఆర్ మ‌ర‌ణం త‌ర్వాత ఒంట‌రైపోయిన జ‌య‌ల‌లిత‌.. పార్టీ ప‌గ్గాల కోసం.. మ‌నుగ‌డ కోసం చాలా శ్ర‌మించింది. ఎంతోమంద‌ని త‌న గుప్పిట్లో పెట్టుకుంది. మాట్లాడ‌నీయ‌కుండా చేసి త‌న స‌త్తా చూపించింది. అలాంటి ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ ఛాయ‌ల‌తో న‌య‌న్ పాత్ర చేస్తుందంటే ఉండే అంచ‌నాలే వేరు. పైగా ఈ చిత్రంలో అంచ‌లంచెలుగా ఎదుగుతూ చివ‌రికి సిఎం అయ్యేవ‌ర‌కు న‌య‌న‌తార జ‌ర్నీ ఆర‌మ్ 2లో సాగుతుంద‌ని చెబుతున్నారు.