Last Updated on by
30 దాటితే దక్షిణాది ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలకు ఇమేజ్ తగ్గిపోతుంది.. క్రేజ్ పడిపోతుంది అంటారు. కానీ కొందరు ముద్దుగుమ్మలకు మాత్రం అది మినహాయింపు. కావాలంటే నయనతారను చూడండి.. ఈమె వయసు ఇప్పుడు 35కి చేరువైంది. కానీ ఇప్పటికీ ఈ భామకు ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. నయన్ అనే పేరు ఓ బ్రాండ్ ఇప్పుడు. దర్శకులు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని పాత్రలకు నయనతార తప్ప మరో ఆప్షన్ లేదు. దానికి తగ్గట్లే ఆమె మార్కెట్ ఉంది.. రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంది. మరో మాట లేకుండా నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చేస్తున్నారు ఈ భామకు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది ఈ భామ. ఈ మధ్యే ఈమె తెలుగులో జై సింహాలో నటించింది. బాలయ్యకు జోడీగా ఈమె నటించిన మూడో సినిమా ఇది.
జై సింహా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో నటించడానికి ఏకంగా మూడున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఇందులో ఏ కట్టింగులు లేవు.. అంటే జిఎస్టీలు.. టిడిఎస్ లేకుండా అన్నమాట. అంటే అక్షరాలా మూడున్నర కోట్లు ఇస్తే కానీ జై సింహా చేయలేదు నయన. అంతేకాదు.. ప్రమోషన్ కు రావాలంటే కూడా ఎక్స్ ట్రా అడుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది కాదు. ముందుగానే అగ్రీమెంట్ లో ప్రమోషన్ కు రాను అనే కుదుర్చు కుంటుంది నయనతార. ఎందుకంటే… తెలుగు మీడియా టూ మచ్ గా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారని అందుకే తాను ఏ ప్రమోషన్ కు రానని తెగేసి చెప్పేసిందని తెలుస్తుంది ఈ భామ.
బాలయ్య సినిమాకే ఇంతగా తీసుకుంటే మరి చిరంజీవితో నటించడానికి సైరా కోసం ఆస్తులు రాయించుకుందేమో ఈ భామ. చిరంజీవి పట్టుబట్టి మరీ నయనతారనే తీసుకున్నాడు. ఈ చిత్రానికి దాదాపు 3 కోట్లకు పైనే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సైరా షూటింగ్ బ్రేక్ లో ఉంది. ఫిబ్రవరి తొలి వారంలో రెండో షెడ్యూల్ జరగనుంది. అప్పుడే నయనతారతో పాటు విజయ్ సేతుపతి లాంటి వాళ్లు కూడా సెట్ లో అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సిజి వర్క్ ముంబైలో జరుగుతుంది. ఇందుకోసమే చిరు సైలెంట్ గా ముంబై వెళ్లి తన ఫేస్ కు సంబంధించిన కొన్ని ఎక్స్ ప్రెషన్స్ క్యాప్చర్ చేసి వచ్చాడు. మొత్తానికి నయనతార హీరోయిన్ గా కావాలంటే ఇప్పుడు ఆస్తులు రాసివ్వక తప్పని పరిస్థితి.
User Comments