సైరా ప్రీరిలీజ్‌లోనే న‌య‌న్ క‌నిపించేది

న‌య‌న‌తార సినిమా ప్ర‌చారానికి స‌హ‌క‌రించ‌దు. ఎంత పెద్ద స్టార్ అయినా నో అంటుంది. ఆ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే ప్రాజెక్ట్ కు సైన్ చేస్తుంది. కానీ సైరా న‌ర‌సింహ‌రెడ్డి విష‌యంలో మాత్రం దాన్ని బ్రేక్ చేసింది. సైరా ప్ర‌చారానికి హాజ‌ర‌వుతాన‌ని క‌మిట్ అయిన‌ప్పుడే ఒప్పుకుంది. కేవ‌లం మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే ఈ స‌డ‌లింపు ఇచ్చింది. అయితే ఇటీవ‌లే ముంబైలో జ‌రిగిన ప్ర‌మోష‌నల్ ఈవెంట్ కు న‌య‌న్ హాజ‌రు కాలేదు. దీంతో సోష‌ల్ మీడియాలో అప్పుడే న‌య‌న్ పై పుకార్లు షికార్లు చేయ‌డం మొద‌లైంది.

న‌య‌న‌తార చిరును సైతం ఖాత‌రు చేయ‌లేదంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇదే విష‌యాన్ని మెగా స‌న్నిహితుల దృష్టికి తీసుకెళ్తే ఆమె కేవ‌లం హైద‌రాబాద్ లో జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు , ఒక ఇంట‌ర్వూకు మాత్ర‌మే హాజ‌ర‌వుతంద‌ని క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ స‌మ‌యంలో ఆన్ సెట్స్ లో యూనిట్ కి ఎంతో స‌హ‌క‌రించింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. న‌య‌న‌తారను ప్ర‌చారానికి స‌హ‌క‌రించండ‌ని మేక‌ర్స్ కోర‌లేదుట‌. చిరుపై అభిమానంతో తానే ఈవెంట్ కు హాజ‌రువుతాని స్వ‌యంగా తెలిపిందిట‌.