నయనతార స్వచ్ఛమైన ప్రేమ

తమిళ్ లో నయన్ ఉంటే చాలు సినిమా హిట్.. ఇప్పుడు నయన్ జోరు ఆలా ఉంది మరి. నయనతార దర్శకుడు విఘ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. విఘ్నేష్ శివ‌న్ దర్శకుడిగా కంటే నయనతార ప్రియుడిగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. నయనతార ప్రేమను పొందిన వారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నయన్ ప్రేమ అంత స్వచ్ఛమైనది. ఈమె ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ గురించే తపనపడే వ్యతిత్వం తనది. ఇప్ప‌టికే ముగ్గురితో మూడుసార్లు ప్రేమ‌లో ప‌డింది న‌య‌న‌తార‌. ప్ర‌తీ ఒక్క‌రికి ఓ వీక్ నెస్ ఉంటుంది. అలా న‌య‌న్ కు ప్రేమ వీక్ నెస్ అన్న‌మాట‌ కానీ తన ప్రేమ కూడా అంత స్వచ్చంగా ఉంటుంది.

Nayanathara True Love With Director Vignesh Shivan

ఇక్క‌డ మాత్రం ఒక్క క్ష‌ణం కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నారు. న‌య‌న్ ప్ర‌స్తుతం విఘ్నేష్ తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. త‌న జ‌వితంలో ఇది మూడో ప్రేమ‌క‌థ‌. ప్ర‌భుదేవా.. శింబుతో ప్రేమ విఫ‌లం అయ్యాక ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉంది న‌య‌న‌తార‌. ఈ ద‌ర్శ‌కుడితో రెండేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోతుంది న‌య‌న‌తార. పెళ్లి అంటే ఎక్క‌డ త‌మ బంధం తెగిపోతుందో అని సింపుల్ గా ప్రేమ‌లోనే ఉన్నారు ఈ జంట‌. తాజాగా విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి న‌య‌న్ ఇచ్చిన పోజు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటు ప్ర‌పంచాన్ని మ‌రిచిపోయారు ఈ జంట‌. ఈ మధ్యే వీళ్లిద్దరి ఫోటో బ‌య‌టికి వచ్చింది. న‌య‌న‌తార‌ను ప్రేయ‌సిలా కాకుండా జీవితం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ జంట జోరు చూస్తుంటే త్వ‌ర‌లోనే ఒక్క‌టైపోయేలా క‌నిపిస్తున్నారు.