నయనతార జీవితం తెరిచిన పుస్తకం

Last Updated on by

Last updated on March 8th, 2018 at 12:48 pm

రెండేళ్లుగా న‌య‌న‌, విఘ్నేష్ జంట స‌హ‌జీవ‌నం చేస్తున్నారనే వార్త‌లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. కానీ ఒక‌రికి ఒక‌రు బ‌య‌ట ప‌డ‌టం లేదంతే. ఎప్పుడు అడిగినా కూడా స్నేహితుల‌మే అంటూ త‌ప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు అంతా తెలిసిన త‌ర్వాత కూడా దాచుకోవ‌డం ఎందుకు అనుకుంటున్నారో ఏమో గానీ ఓపెన్ అయిపోయారు. తమ బంధాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్తున్నారు. కొంత‌కాలంగా ప్రియుడితోనే క‌లిసి ఉంది న‌య‌న‌తార‌. ఓ వైపు సినిమాలు చేస్తున్నా కూడా ఎప్ప‌టికప్పుడు స‌మ‌యం దొరికిన ప్ర‌తీసారి విఘ్నేష్ తో క‌లిసి విదేశీ ట్రిప్పులకు వెళ్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసారు ఈ జంట‌. తాజాగా విఘ్నేష్ తో ఉన్న ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఇద్ద‌రూ ఫారెన్ లో ఉన్నారు. త‌మ టూర్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.Nayanathara Vignesh Shivan Long Holiday California Tourన‌య‌న‌తార త‌న ప్రేమ గురించి బ‌య‌టికి చెప్ప‌డానికి  సాహ‌సించ‌డం లేదు. ఎందుకంటే ఈ భామ జీవితంలో ప్రేమ పెద్ద‌గా క‌లిసిరాలేదు. ఇప్ప‌టికే ముగ్గురితో రెండు సార్లు ప్రేమ‌లో ప‌డి ఓడింది న‌య‌న‌తార‌. ప్ర‌తీ ఒక్క‌రికి ఓ వీక్ నెస్ ఉంటుంది. అలా న‌య‌న్ కు ప్రేమ వీక్ నెస్. ప్ర‌భుదేవా.. శింబుతో ప్రేమ విఫ‌లం అయ్యాక ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉంది న‌య‌న‌తార‌. ఈ ద‌ర్శ‌కుడితో రెండేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగింది న‌య‌న‌తార. పెళ్లి అంటే ఎక్క‌డ త‌మ బంధం తెగిపోతుందో అని సింపుల్ గా ప్రేమ‌లోనే ఉన్నారు ఈ జంట‌. తాజాగా విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి న‌య‌న్ ఇచ్చిన పోజు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటు ప్ర‌పంచాన్ని మ‌రిచిపోయారు ఈ జంట‌. న‌య‌న‌తార‌ను ప్రేయ‌సిలా కాకుండా జీవితం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ జంట జోరు చూస్తుంటే త్వ‌ర‌లోనే ఒక్క‌టైపోయేలా క‌నిపిస్తున్నారు.

User Comments