నయనతారకు చెర్రీ ఎంతిస్తున్నాడో తెలుసా..?

Nayantara charge Rs 4 Crore act Chirus Uyyalawada Narasimhareddy

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ, 150వ సినిమా అంటూ ‘ఖైదీ నెంబర్ 150’ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తన స్టార్ డమ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఎక్కడా తగ్గకుండా ఏకంగా 150 కోట్ల రూపాయలకు మించిన బడ్జెట్ తో చిరుతో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బయోపిక్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ కసరత్తులే చేస్తుండగా, నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మెగా సినిమాను నేషనల్ లెవెల్ లో చూపించాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపికను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సస్పెన్స్ లో నలుగుతున్న హీరోయిన్స్ ఎంపికను దాదాపుగా పూర్తి చేసేశారని తెలుస్తోంది. అందులో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరు బలంగా వినిపిస్తుండగా.. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు దాదాపుగా ఓకే అయిపోతున్న నయన్ గురించి మాట్లాడుకుంటే.. మామూలుగా మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకునే నయన్.. ఈ మెగా సినిమాకు ఏకంగా 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. ఎందుకంటే, ఈ మెగా సినిమా ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కి.. హిందీ, మలయాళం భాషల్లో కూడా డబ్ కానుంది కాబట్టి.
అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక మెగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా నయన్ ను ఒప్పించారట. ఈ కారణంగా నయన్ 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే.. మన మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు కాబట్టి రూ. 4 కోట్లు ఇవ్వడానికి ఓకే అన్నాడని తాజా ఫిల్మ్ నగర్ టాక్. ఇదే సమయంలో నిర్మాత రామ్ చరణ్ ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడుతున్నా కూడా ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తుండటం విశేషం. ఏదిఏమైనా, ఇప్పుడు నయనతారకు చెర్రీ 4 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని తెలియడం నిజంగా విశేషమే. ఇకపోతే, ఈ ఆగష్టు 15న ఈ మెగా క్రేజీ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తుండటంతో.. అప్పుడు మొత్తంగా కొన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు.