నిజమా.. 2 రోజులకు హీరోయిన్ కు రూ.5 కోట్లు

సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, భారీ రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తోన్న నయనతార గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ సొంతంగా నయన్ కొంత మార్కెట్ ను కలిగి ఉండటంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటుతానే ఉంది.

ముఖ్యంగా తమిళనాట నయన్ కు స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ ఉండటంతో.. కోలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో సౌత్ దర్శక నిర్మాతలు నయన్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారంటేనే.. అమ్మడు ఏ రేంజ్ లో తన టాలెంట్ చూపిస్తుందో అర్థమైపోతుంది.

అయితే, ఇంత పాపులారిటీ ఉన్నా కూడా నయన్ ఇప్పటివరకు దానిని ఓ విషయంలో సరిగ్గా వాడుకోకపోవడం బాధాకరం.

ప్రధానంగా తన ఇమేజ్ ను వాణిజ్య ప్రకటనలకు యాడ్ చేసుకుంటూ క్యాష్ చేసుకోవడంలో నయన్ వెనుకబడిందనే చెప్పొచ్చు.

ఈ విషయంలో ఇప్పటి హీరోయిన్స్ అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

అందుకే ఇప్పుడు నయన్ కూడా వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుందో ఏమో.. ఒక్కసారిగా షాక్ ఇచ్చే డీల్ సెట్ చేసుకుందని తెలియడం ఇప్పుడు సౌత్ సర్కిల్ లో సంచలనంగా మారింది.

ఆ స్టోరీలోకి వెళితే, రీసెంట్ గా నయన్ కూడా వాణిజ్య ప్రకటనలో నటించడం స్టార్ట్ చేసిందట. అందులో భాగంగానే తాజాగా ఓ డీటీహెచ్ వాణిజ్య ప్రకటనలో నటించిందని సమాచారం.

అయితే, దీనికి గాను నయన్ ఏకంగా 5 కోట్ల రూపాయలు పుచ్చుకుందని తెలియడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అందులోనూ దీనికి నయన్ కేవలం రెండు రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించిందని తెలియడం ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తోందని అంటున్నారు.

అంటే, మొత్తంగా 2 రోజులకు 5 కోట్ల రూపాయలు తీసుకుని నయన్ దుమ్మురేపడమే నిజమైతే, ప్రస్తుతం సౌత్ స్టార్లకు ఇంతకంటే పెద్ద షాక్ ఇంకోటి ఉండదేమో.

Follow US