జై లవ కుశ ఇన్ సైడ్ రిపోర్ట్.. నెగిటివ్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ అంటూ నట విశ్వరూపం చూపించబోతున్నాడనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే అది నిజమేనేమో అనిపించడం ఖాయం. అంతలా తనదైన నటనతో రెచ్చిపోయిన ఎన్టీఆర్.. ఈ సెప్టెంబర్ 21న బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి ఇన్ సైడ్ రిపోర్ట్ అంటూ జై లవ కుశ పై నెగిటివ్ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ మేరకు వెబ్ మీడియా సర్కిల్ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ క్రేజీ సినిమాపై ఓ స్టోరీ హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది.
భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న చిత్ర యూనిట్.. జై లవ కుశ స్టోరీ దగ్గర మాత్రం కాస్త తడబడ్డారని నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సెకండాఫ్ కొంతమేర ట్రాక్ తప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయని మీడియా సర్కిల్ లో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అలాగే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాకి మోడ్రన్ వెర్షన్ గా జై లవ కుశ ని తెరకెక్కించారని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, ఈ ఇన్ సైడ్ రిపోర్ట్ అంటూ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం మాత్రం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, టీజర్లు, ట్రైలర్ తో ఆకట్టుకున్న జై లవ కుశ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా పాతుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ సైడ్ రిపోర్ట్ లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలంటే.. రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.