కలికి చిలక‌రా.. ఉలికి పడకురా..

Last Updated on by

కలికి చిలక రా.. కలిసి కులక రా ఉలికి పడకు రా..
ఆ ఉడికే వయసు రా హే తద్ది తళాంగు లౌలీ లతాంగి
నువ్వే జతందిరా లివ్ టు లవ్ అందిరా ….
చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. నీ చెలినే మరచేవో..
ఊ..హ..హ..! నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను..

చ‌ర‌ణ్ బ్యూటీ నేహా శ‌ర్మ‌ను చూడ‌గానే ఇలా సాంగేసుకోకుండా ఉండ‌గ‌ల‌రా! పాట పాత‌దే అయినా అందం కొత్త‌దే. ప్ర‌ఖ్యాత మ్యాగ్జిమ్ క‌వ‌ర్‌పేజీ కోసం నేహాశ‌ర్మ ఇలా ఫోజులిచ్చింది. అదిరిపోయే బికినీ అందాల‌తో క‌వ్వించిందిలా. తెల్ల బికినీలో హంస‌ను త‌ల‌పించింది. జ‌ల్లెడ జ‌ల్లెడ బాట‌మ్‌.. అదే వైట్ క‌ల‌ర్ టాప్ పీస్‌తో ఓల‌లాడించింది.

పూల్ సైడ్ మ‌రీ ఇంతందంగా క‌వ్విస్తే కుర్ర‌కారు కంటికి కునుకు ప‌డుతుందంటారా? అవాక్క‌య్యి కాసేపు అలా మౌన‌ముద్ర‌కే అంకిత‌మ‌వ్వ‌రూ. జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలే.. అంటూ ఓ రేంజులో ఆస్వాధిస్తోంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ అమ్మ‌డు ఇలా కొత్త అస్సైన్‌మెంట్స్‌తో చెల‌రేగిపోతోంది. అందుకు కార‌ణం బ‌హుషా `హేరా ఫేరి -3`లో అవ‌కాశం రావ‌డ‌మే అయ్యి ఉండొచ్చు. ఈ సినిమాలో న‌టిస్తూనే, ఇటు ద‌క్షిణాది నిర్మాత‌ల‌కు ఈ అమ్మ‌డు గాలం వేస్తోందిట‌. మొత్తానికి `చిరుత` బ్యూటీని మ‌రోసారి టాలీవుడ్‌లోనూ చూసే చాన్సుంటుందేమోన‌న్న అంచ‌నాలు వేస్తున్నారు.

User Comments