రెడ్ హాట్ బికినీ బుల్బుల్

గుచ్చి గుచ్చి చూస్తోంది. గుండె లయ తప్పేలా చేస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మడు? కొంటె తలపులతో కుర్రకారు వలపు దోపిడీని యథేచ్ఛగా సాగిస్తోంది. హేయ్ బాబూ .. ఇటురా అంటూ కవ్విస్తున్నట్టే కనిపిస్తోంది కదూ! ఆ కొంటె పిలుపు గుండె గదిలో నిదురపోయి ఇప్పటికే పదేళ్లు పైగానే అయ్యింది. అసలెవరండీ.. ఈ ముద్దుగుమ్మ? అంటే .. ఇంకెవరు చిరుత సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై మెగాభిమానుల గుండెల్లో నిదురించిన నేహాశర్మ గురించే ఇదంతా. ఈ ముంబై సోగ్గత్తె తలబిరుసు వ్యవహారంపై అప్పట్లో ఫ్యాన్స్ చాలానే మాట్లాడుకున్నారు.

nehasarma red hot bikini

అయితే అందరినీ నిరాశలో ముంచేసి ఈ అందం ఎటో ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్లినా అక్కడ తనవైన అందచందాలతో యూత్‌ని మత్తెక్కిస్తోంది. మోడళింగ్ రంగంలో ఎదురేలేని క్వీన్‌గా వెలిగిపోతూ అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో `హేరాఫేరి3` లో నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మ్యాగ్జిమ్ కవర్‌పేజీపై రెడ్ హాట్ బికినీలో కుర్రకారు మతి చెడగొట్టింది. నేహా ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంతకంతకు వేడి పెంచుతోంది.