అక్క‌డ రాజు పాచిక‌లు పార‌లేదు..

నేనేరాజు నేనేమంత్రి.. తెలుగులో రానాకు సోలో హీరోగా ఇమేజ్ మ‌రింత‌గా పెంచిన సినిమా ఇది. 23 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓపెనింగ్స్ తోనే నేనేరాజు హిట్ కేట‌గిరీలో చేరిపోయింది. ఎలాగూ రానాకు త‌మిళనాట కూడా మంచి గుర్తింపు ఉంది క‌దా అని అక్క‌డ కూడా సినిమాను రిలీజ్ చేసారు. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమాను ఇప్పుడు విడుద‌ల చేసార‌క్క‌డ‌. వివేగం.. విఐపి 2 లాంటి సినిమాలు ఉండ‌టంతో ఆగ‌స్ట్ ను కాద‌ని సెప్టెంబ‌ర్ 22న నేనేరాజు నేనేమంత్రి సినిమాను విడుద‌ల చేసారు. కానీ ఈ చిత్రానికి త‌మిళ‌నాట ఊహించినంత రెస్పాన్స్ రావ‌డం లేదు. ఈ వార‌మే విడుద‌లైన ఈ చిత్రానికి క‌నీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. రొటీన్ రెగ్యుల‌ర్ పొలిటిక‌ల్ డ్రామా అంటూ లైట్ తీసుకుంటున్నారు తమిళ తంబిలు. పైగా తేజ అంటే ఎవ‌రో కూడా అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. ఇవ‌న్నీ నేనేరాజు నేనేమంత్రిని త‌మిళ ప్రేక్ష‌కుల నుంచి దూరం చేసాయి. మొత్తానికి రానా పాచిక‌లు అక్క‌డ పార‌లేదు.