షాక్.. ప్రభాస్ సాహో కోసం అప్పుడే రూ. 50 కోట్లు

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఇదే సమయంలో ప్రభాస్ మార్కెట్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అది ఎంతలా అంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న సాహో సినిమా అప్పుడే మార్కెట్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం చూస్తుంటే అర్థమైపోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తవడానికి ఇంకా ఆరు నెలలకు పైగా సమయం పట్టేలా ఉన్నా.. అప్పుడే ఈ సినిమా కోసం మార్కెట్ లో పోటీ మొదలైపోవడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా సాహో సినిమా ఆన్ లైన్ ప్రసారానికి సంబంధించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం పెట్టి కొనుక్కుందని తెలియడం ఇప్పుడు హాట్ న్యూస్ అయింది.
అదీ కాకుండా ఇంతకుముందే బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు పెట్టి కొనుక్కున్న నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు సాహో సినిమాను ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు పెట్టి కొనుక్కుంటున్నారని తెలియడం షాకింగ్ న్యూస్ అయింది. ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో.. ఆ రేంజ్ లో రేటు పలికిందని అంటున్నారు. అయితే, ఆన్ లైన్ వరకే ఈ 50 కోట్ల రూపాయల డీల్ కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా ఇంకా బయటకు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతానికైతే, వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా కనిపిస్తోన్న ఈ సాహో సినిమా ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఈ లెక్కన అప్పుడే ఈ సినిమా అంతకుమించి అనేలా బిజినెస్ చేస్తుండటం నిజంగా విశేషమనే అనాలి.