నెవ్వ‌ర్ బిఫోర్ క్లైమాక్స్‌

Last Updated on by

టాలీవుడ్ హిస్ట‌రీలోనే నెవ్వ‌ర్ బిఫోర్ క్లైమాక్స్‌ని తొంద‌ర్లోనే చూడ‌బోతున్నాం. విజువ‌ల్ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ ని ఉప‌యోగించ‌డంలో తెలుగు సినిమా వ‌ర‌కూ కోడి రామ‌కృష్ణ పేరు వినిపిస్తుంది. దేవుళ్ల సినిమాల్లో గొప్ప వీఎఫ్ఎక్స్‌ని ఉప‌యోగించే ద‌ర్శ‌కుడిగా కోడికి పేరుంది. ఇప్పుడు ఆ పేరును రీప్లేస్ చేసేవాడొక‌డొచ్చాడంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. ఇంత‌కీ ఎవ‌రాయ‌న? అంటే.. అత‌డి పేరు హ‌ను రాఘ‌వ‌పూడి.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ – సాయిప‌ల్ల‌వి జంట‌గా ప‌డి ప‌డి లేచే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న హ‌ను ఈ సినిమా కోసం భారీ గ్రాఫిక్స్‌ని ఉప‌యోగిస్తున్నార‌ట‌. ఇందులో ప్ర‌ధానంగా క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. క్లైమాక్స్‌లో హ‌ను భూకంపం సీన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందిట‌. మెరుపులు ఉరుముల స‌న్నివేశాల‌కు మోడ్ర‌న్ లైట్నింగ్‌ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పుడు `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` సినిమా క్లైమాక్స్ కోసం ఆ సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తార‌ట‌. ఇందుకోసం హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సెట్ డిజైన్ చేశార‌ని తెలుస్తోంది. కోల్‌క‌త‌, నేపాల్ షెడ్యూల్స్‌తో పాటు హైద‌రాబాద్ షెడ్యూల్ భారీగా ఉంటుంద‌ని తెలిసింది.

User Comments