చ‌మేలీ రాణి అని పిలిచారు!

Last Updated on by

నేను వేసిన లేడీ గెట‌ప్ చూసి న‌న్ను మా ఇంట్లో మా అమ్మాయి చ‌మేలీ రాణి అంటూ ఆట‌ప‌ట్టించింది అని అన్నారు శ్రీ‌నివాస‌రెడ్డి. `గీతాంజ‌లి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. ఈ సినిమాకు మ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 22న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో శ్రీనివాస‌రెడ్డి పాత్రికేయుల‌తో మాట్లాడుతూ పైవిధంగా స్ప ందించారు.

శ్రీ‌నివాస్‌రెడ్డి మాట్లాడుతూ-“జంబ‌ల‌కిడి పంబ క‌థే హీరో. అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించే ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది. ఇందులో అమ్మాయిగానూ క‌నిపిస్తాను. ఆ పాత్ర కోసం న‌రేశ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన సినిమాలు చూశాను. చంట‌బ్బాయిలో చిరంజీవిగారి పెర్ఫార్మెన్స్ చూశాను. ఇంట్లో కూడా మా ఆవిడ నైటీ వేసుకుని కాసేపు ఎలా ఉంటుందో చూశాను. అందుక‌ని ఆ రూపం బాగా కుదిరింది. ఇంట్లో వాళ్లు ఆ పాత్ర‌ను చూసి…. మా ఆవిడతో మా పెద్ద‌మ్మాయి.. `చూడమ్మా.. మ‌నింటికి చ‌మేలీ రాణి వ‌చ్చింది అంటూ ఆట‌పట్టించింది. నైటీలు, లిప్‌స్టిక్‌లు వేసుకుని కేర‌వ్యాన్ నుంచి దిగేట‌ప్పుడు కొంత సేపు ఇబ్బ ంది ప‌డినా పాత్ర కోసం అది త‌ప్ప‌లేదు. మను ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన తొలి సినిమా నేను చూడ‌లేదు. క‌థ బాగా చెప్పారు. విన‌గానే బాగ‌నిపించింది. రెండు సార్లు క‌థ విన్నా. మొన్న సినిమా చూశాక చెప్పింది చెప్పిన‌ట్టు తీశార‌నిపించింది.. అన్నారు. పాత `జంబ‌ల‌కిడి పంబ‌`కు ఈ సినిమాకూ ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. ఆ చిత్రంలో ఊర్లో వాళ్లంతా అటూ ఇటూగా మారుతారు. మా సినిమాలో ఒక కుటుంబంలోని భార్యాభ‌ర్త‌లు మాత్ర‌మే అటూ ఇటూ మారుతారు. అంత‌కు మించి ఏమీ ఉండ‌దు.. అని తెలిపారు.

User Comments