సెగ‌లు రేపుతున్న కొత్త భామ

Last Updated on by

తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌ళ్లీ ముంబై భామ‌ల హ‌వా మొద‌లైంది. అక్క‌డ స్టార్ భామ‌లుగా కొన‌సాగుతున్న‌వాళ్లు మొద‌లుకొని… కొత్త‌వాళ్ల వ‌ర‌కు టాలీవుడ్‌కి క్యూ క‌డుతున్నారు. ఇక్క‌డ ఇస్తున్న పారితోషికం, ఇక్క‌డ ల‌భించే అవ‌కాశాలే అందుకు కార‌ణం. తాజాగా అక్క‌డ్నుంచి దిగుమతైన మ‌రో అందమే ఈ భామ‌. పేరు… అన్య‌సింగ్‌. సందీప్‌కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `నిను వీడ‌ని నీడ‌ని నేనే`లో న‌టించింది. బాలీవుడ్‌లో య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన `ఖైదీ బంద్‌` చిత్రంతో బాలీవుడ్‌లో త‌ళుక్కున మెరిసిందీ భామ‌. ఇప్పుడు టాలీవుడ్‌ని దున్నేయ‌డానికి సిద్ధ‌మైంది. ఇలా హాట్ హాట్ ఫొటో షూట్‌తో వేడెక్కించింది. ఈ స్టిల్స్ ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. టాలీవుడ్‌కి కూడా ఇలాంటి అందాల భామ‌లే క‌దా కావ‌ల్సింది. మ‌రి ఈ ముద్దుగుమ్మ కొత్తగా అవ‌కాశాలు అందుకోవాలంటే `నిను వీడ‌ని నీడ‌ని నేనే` చిత్రం విడుదల కావాలో లేదంటే, ఈ అందాల ఘాటే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని ఆక‌ర్షిస్తుందో చూడాలి.

User Comments