కొత్త భూ చట్టం ధ‌డ‌.. వీఆర్వోల్లో టెన్ష‌న్

రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సూచనలను చేశారు కెసిఆర్. ఇక దీంతో ఇప్పటికే, ప్రవేశపెట్టబోయే కొత్త భూ చట్టంపై కసరత్తు జరుగుతోంది. భూ వివాదాలను నివారించడానికి టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

వీఆర్‌ఓలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. భూమి ఖర్చులు పెరగడం వల్ల, రిజిస్ట్రేషన్లపై వివాదాలు.. పేర్లు .. సరిహద్దుల్లో లోపాలు కూడా పెరిగాయి. చట్టాలపై వీఆర్‌ఓలలో అవగాహన లేకపోవడం కూడా ఎక్కువ పొరపాట్లు జరుగుతున్నాయి. అయితే అందరూ తప్పు చెయ్యకున్నా కొందరి వల్ల అందరికీ శిక్ష పడనుంది.