పెద‌విముద్దుల్లో చెల‌రేగుతోందే

Last Updated on by

`చిత్రం` సినిమాలో రీమాసేన్‌, `ఆర్‌.ఎక్స్100`లో పాయ‌ల్ రాజ్‌పుత్ ఇద్ద‌రికీ పోలిక‌లున్నాయ్‌. ఈ ఇద్ద‌రూ డెబ్యూ సినిమాల‌తో ఒకే త‌ర‌హా దూకుడు చూపించారు. ఈ దూకుడు తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. పెద‌వి ముద్దులు, వేడెక్కించే స‌న్నివేశాల‌తో ఓవ‌ర్‌నైట్ పాపుల‌రైన క‌థానాయిక‌లుగా చెప్పుకోవ‌చ్చు. రీమాసేన్‌కి ఓవ‌ర్‌నైట్ పాపులారిటీ తెచ్చింది త‌న‌లోని ఆ డేరింగ్ యాటిట్యూడ్‌.. గ‌ట్సే. ఇటీవ‌ల‌ ఆర్‌.ఎక్స్100 బ్యూటీ ఆ రేంజు దూకుడుతో దూసుకొచ్చింది. తొలి సినిమా పెద్ద స‌క్సెస్ అవ్వ‌డానికి పెద‌వి ముద్దులు, అర‌టితోట‌లో రొమాంటిక్ స‌న్నివేశాలు కార‌ణ‌మ‌య్యాయి. మొత్తానికి ఆర్‌.ఎక్స్ 100 స‌క్సెస్‌ పుణ్యం అంతా పాయ‌ల్‌దేన‌ని గుర్తించారంతా. ప్ర‌స్తుతం ఈ భామ తేజ ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమాకి సంత‌కం చేసింద‌ని వార్త‌లొచ్చాయి.

అదంతా అటుంచితే.. ఇప్పుడు పాయ‌ల్ రూట్‌లోనే మ‌రో డెబ్యూ భామ దూకుడు చూపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఫైట్‌మాష్టార్ విజ‌య్ త‌న‌యుడు అరుణ్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో కావ్య త‌ప‌ర్ నాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ భామ పెద‌వి ముద్దుల‌తో బోల్డ్ ఎటెంప్ట్ చేస్తోంద‌ని తాజాగా రిలీజైన సాంగ్ ప్రోమో చెబుతోంది. అయితే పాయ‌ల్ రేంజులో ఈ అమ్మ‌డు త‌న సినిమాకి అస్సెట్ అవుతుందో లేదో రిలీజ్ వ‌ర‌కూ కాస్త‌ వేచి చూడాల్సిందే.

User Comments