హాలీవుడ్ రేంజ్‌ ప్ర‌మోష‌న్‌

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మల్‌హాస‌న్ న‌టించి, స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 10న రిలీజ‌వుతోంది. తీవ్ర‌వాదం నేప‌థ్యంలో భారీ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. పూజా కుమార్ క‌థానాయిక‌గా న‌టించింది. రాహుల్ బోస్‌, ఆండ్రియా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా తొలి భాగానికి ప్రీక్వెల్ కం సీక్వెల్ త‌ర‌హాలో ఉంటుంద‌ని క‌మ‌ల్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇక‌పోతే విశ్వ‌రూపం 2 చిత్రానికి ప్ర‌మోష‌న్స్ ప‌రంగా అత‌డు ఎంతో వైవిధ్య‌మైన పంథాని అనుస‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ స‌హా హిందీలో రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి ప్ర‌తిరోజూ వార్త‌ల్లో నిలిచేలా ఏదో ఒక మంత్రాంగాన్ని క‌మ‌ల్ అనుస‌రిస్తూనే ఉన్నారు. ఇదివ‌ర‌కూ సల్మాన్ హోస్టింగ్ చేసిన బిగ్‌బాస్ షోలో హిందీ వెర్ష‌న్‌ని ప్ర‌మోట్ చేశారు. త‌మిళ‌నాట తాను హోస్టింగ్ చేస్తున్న బిగ్‌బాస్ హౌస్‌లోనూ ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు, టీజ‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా విశ్వ‌రూపం 2 కొత్త టీజ‌ర్‌ని క‌మ‌ల్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ ఆద్యంతం పోరాట స‌న్నివేశాల‌తో ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఈసారి రెగ్యుల‌ర్‌గా కాకుండా డీప్ బ్లూ సీలో భీక‌ర పోరాటాన్ని చూపించాడు టీజ‌ర్‌లో. ఇక క‌మ‌ల్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ చూస్తుంటే హాలీవుడ్ రేంజులో క‌నిపిస్తోంది. రిలీజ్ నెల‌ముందు రోజు రోజుకి వేడి పెంచేందుకు హాలీవుడ్ సినిమాల‌కు ఈ తీరుగానే ప్ర‌మోష‌న్ చేస్తుంటారు. మొత్తానికి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ విశ్వ‌రూపం 2ని బంప‌ర్‌హిట్ చేయ‌డ‌మే ధ్యేయంగా క‌మ‌ల్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. మ‌రో 13రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

User Comments